గాంధీ భవన్ లో పీఏసీ సమావేశం.. పార్లమెంట్ ఎన్నికలపై చర్చ!

గాంధీ భవన్ లో పీఏసీ సమావేశం.. పార్లమెంట్ ఎన్నికలపై చర్చ!

హైదరాబాద్: గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ( పీఏసీ) సమావేశం ప్రారంభమైంది.  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పీఏసీ భేటీ అయ్యింది. పీఏసీ ఛైర్మన్ మాణిక్ రావు థాక్రే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

వచ్చే పార్లమెంట్ ఎన్నికల సన్నాహకాలు,  ఆరు గ్యారెంటీల అమలు, నామినేటెడ్ పోస్టులపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన కార్యకర్తలకు పీఏసీ ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలుస్తోంది. 

ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ హైకమాండ్ కు వివరించనున్నారు.  డిసెంబర్ 19వ తేదీ మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీ బయల్దేరి వెల్లి.. మంత్రివర్గం విస్తరణపై అధిష్టానంతో చర్చించనున్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ హైకమాండ్ కు వివరించనున్నారు.