పెనుబల్లి, వెలుగు : లోక కల్యాణం కోసం పలువురు సాధువులు ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి నుంచి తమిళనాడులోని రామేశ్వరం వరకు పాదయాత్ర చేపట్టారు. బిహార్‌కు చెందిన సాధువులు మణికంత్ షా, శ్యామ్, రామ్‌జీత్, అశుతోష్, సుధీష్ట్, చిరామ్జీవ్, లాల్బచ్చన్ 73 రోజుల కింద గంగోత్రిలో పాదయాత్ర మొదలుపెట్టి మంగళవారం పెనుబల్లి మండలం వియంబంజర్కు చేరుకున్నారు.
మరో 43 రోజుల్లో కాలినడకన రామేశ్వరం చేరుకుంటామని వారు తెలిపారు. స్థానిక భక్తులు అనుమోలు సాంబశివరావు, వంగా చెన్నారావు సాధువులకు పండ్లు అందజేశారు