35 శాతం వడ్లకే మూతపడ్తున్నయ్​.. ఒక్కొక్కటిగా మూతపడుతున్నాసెంటర్లు

35 శాతం వడ్లకే  మూతపడ్తున్నయ్​.. ఒక్కొక్కటిగా మూతపడుతున్నాసెంటర్లు

మహబూబ్​నగర్, వెలుగు: ఆలస్యంగా 35 శాతం వడ్లకే  మూతపడ్తున్నయ్​.. ఒక్కొక్కటిగా మూతపడుతున్నా సెంటర్లు వరి వేసిన వారు మాత్రమే ప్రస్తుతం సెంటర్లకు వడ్లు తెస్తున్నారు. అవి కూడా అరకొరగానే వస్తుండడంతో ఆఫీసర్లు సెంటర్లను మూసేస్తున్నారు. వడ్ల కొనుగోలు లక్ష్యం చేరకముందే సెంటర్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. మార్చి మూడో వారంలో సెంటర్లను తెరిచి రైతుల నుంచి వడ్లను సేకరించాల్సి ఉండగా, ఏప్రిల్​ మూడో వారం నుంచి స్టార్ట్​ చేయడం మైనస్​గా మారింది. అప్పటికే మెజార్టీ రైతులు వడ్లను ప్రైవేట్​లో అమ్ముకున్నారు.

35 శాతం వడ్లనే కొన్నరు..

మహబూబ్​నగర్​ జిల్లాలో ఈ యాసంగిలో 1.20 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తం 3.50 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు వస్తాయని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేశారు. దీని ప్రకారం సివిల్​ సప్లై ఆఫీసర్లు జిల్లా వ్యాప్తంగా 190 సెంట్లను ఓపెన్​ చేసి, 1.50 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లను కొనుగోలు చేయాలని టార్గెట్ గా​పెట్టుకున్నారు. కానీ, టార్గెట్​ రీచ్​ కావడం లేదు. ఏప్రిల్​ 15 నుంచి సెంటర్లను తెరువాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినా.. ఆ తరువాత వారం రోజులకు సెంటర్లను ఓపెన్​ చేశారు. సెంటర్లను తెరిచి నెల రోజులు కావస్తున్నా.. ఇంత వరకు 50 శాతం వడ్లను కూడా సేకరించలేదు. ఐకేపీ నుంచి 94 సెంటర్ల ద్వారా 3,713 మంది రైతుల నుంచి 17, 902 మెట్రిక్​ టన్నులు, పీఏసీఎస్​ నుంచి 91 సెంటర్ల ద్వారా 6,104 మంది రైతుల నుంచి 35,615 మెట్రిక్​ టన్నులు, మెప్మా ద్వారా ఒక సెంటర్​ నుంచి 147 మంది రైతుల నుంచి 713 మెట్రిక్​ టన్నులు, డీసీఎంఎస్​ నాలుగు సెంటర్ల ద్వారా 125 మంది రైతుల నుంచి 629 మెట్రిక్​ టన్నుల వడ్లను మాత్రమే కొన్నారు. ఈ లెక్కల ప్రకారం 1.50 లక్షల మెట్రిక్​ టన్నుల టార్గెట్​లో 30 నుంచి 35 శాతం వరకు మాత్రమే వడ్లను సేకరించారు.

మూతపడుతున్న సెంటర్లు..

ప్రస్తుతం జిల్లాలోని నవాబ్​పేట, హన్వాడ, ఉమ్మడి గండీడ్​ ప్రాంతాల్లోని సెంటర్లకు మాత్రమే వడ్లు వస్తున్నాయి. అడ్డాకుల, మూసాపేట, చిన్నచింతకుంట ప్రాంతాల్లో సెంటర్లు తెరిచి ఉంచినా వడ్లు రావడం లేదు. మిడ్జిల్, చిన్నచింతకుంట మండలాల్లో అడపాదడపా రైతులను వడ్లను తీసుకొస్తున్నారు. దీంతో ఆఫీసర్లు సెంటర్లను మూసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఐకేపీ ఆధ్వర్యంలోని 94 సెంటర్లకు  గాను ఆరు సెంటర్లను మూసేశారు. మరికొద్ది రోజుల్లో వడ్లు రాని సెంటర్లను మూసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

అకాల వర్షాల ఎఫెక్ట్..

జిల్లాలోని చిన్నచింతకుంట, దేవరకద్ర, అడ్డాకుల, మూసాపేట, జడ్చర్ల, మిడ్జిల్, బాలానగర్​ ప్రాంతాల్లో రైతులు మార్చి చివరి వారంలోనే వరి కోతలు మొదలు పెట్టి, ఏప్రిల్​ మొదటి వారంలో వడ్లను ఆరబెట్టుకోవడం పూర్తి చేశారు. కానీ, సెంటర్లు ఓపెన్ చేయలేదు. అదే టైంలో రెండు వారాల పాటు అకాల వర్షాలు రైతులను వెంటాడాయి. గాలివానకు చాలా గ్రామాల్లో కల్లాల్లో ఆరబెట్టిన వడ్లు తడిసిపోయాయి. కొన్ని చోట్ల వడ్లు మొలకెత్తి రైతులు నష్టపోయారు. దీంతో చేసేది లేక రైతులు తమ పంటను మొత్తం ప్రైవేట్​ వ్యాపారులు, కర్ణాటకలోని రాయచూర్​ సేట్లకు అమ్మేశారు. వారే స్వయంగా కల్లాల వద్దకు వచ్చి కాంటాలు పెట్టి మరి లారీల్లో పంటను  తీసుకెళ్లారు.

20 రోజుల్లో టార్గెట్​ కంప్లీట్​ చేస్తాం..

దేవరకద్ర నియోజకవర్గంలో ముందుగానే వడ్లను కొన్నాం. ఆ ఏరియాలో నాలుగు రోజులుగా ఒక్కో సెంటర్​ను బంద్​ చేస్తున్నారు. ప్రస్తుతం గండీడ్, మహమ్మదాబాద్, హన్వాడ ప్రాంతాల్లోని సెంటర్లకు రైతులు వడ్లు తీసుకొస్తున్నారు. మరో 20 రోజుల పాటు సెంటర్లకు వడ్లు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 1.20 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు వస్తాయని అంచనా ఉంది.  - ప్ర