ప్యాడీ ఫిల్లింగ్​ మిషన్​ పేటెంట్​ పొందిన స్టూడెంట్​

ప్యాడీ ఫిల్లింగ్​ మిషన్​ పేటెంట్​ పొందిన స్టూడెంట్​

వేములవాడరూరల్, వెలుగు : ప్యాడీ ఫిల్లింగ్​ మిషన్​ తయారీలో రాజన్న సిరిసిల్ల జిల్లా హన్మాజిపేట జడ్పీహెచ్​ఎస్​ స్టూడెంట్​ అభిషేక్​కు భారత ప్రభుత్వం పేటెంట్​ హక్కులు ఇవ్వగా జిల్లా కలెక్టర్​ అనురాగ్​ జయంతి శనివారం ఆయనకు శాలువా కప్పి అభినందించారు. అభిషేక్​ 8వ తరగతి చదువుతున్న సమయంలో జాతీయస్థాయిలో ఇన్​స్పైర్​ మనాక్ 2019 సంవత్సరంలో మూడవ స్థానం పొందాడు. 

హనుమాజిపేట జడ్పిహెచ్ఎస్ విద్యార్థి మరిపల్లి అభిషేక్ తయారు చేసిన ప్యాడి ఫిల్లింగ్ మిషన్ కు అతని తండ్రి లక్ష్మీరాజం పేరున పేటెంట్ హక్కులు ఇచ్చారు. ప్రస్తుతం అభిషేక్​ బీటెక్​ చదువుతుండగా జపాన్​లో నవంబర్​లో జరిగే అంతర్జాతీయ సదస్సుకు కూడా ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ విద్యార్థిని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, డీఈవో రమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ రావు, జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య, గైడ్​ టీచర్ కోరెం వెంకటేశం, అభినందించారు.