ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత  

కథలాపూర్,వెలుగు: రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. బుధవారం కథలాపూర్ మండలం అంబారిపేట, తుర్తి, తాండ్రియాల, గంభీర్పూర్, బొమ్మెన గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు. గ్రేడ్​ఏ రకం రూ.2060 , సాధారణ రకానికి రూ.2,040 మద్దతు ధర లభిస్తోందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దళారులను నమ్మి మోసపోవద్దు..

గంగాధర: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే ప్రభుత్వ మద్దతు ధర లభిస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. గంగాధర మండలం వెంకంపల్లి, గోపాల్​రావుపల్లి, మల్లాపూర్, కాసారంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్​ ఎంపీపీ రాజగోపాల్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సిరిసిల్ల టౌన్ :సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య, సింగిల్​విండో చైర్మన్ లక్ష్మి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మార్వో విజయ్ కుమార్, సింగిల్ విండో వైస్ చైర్మన్ నారాయణ గౌడ్, రైతులు పాల్గొన్నారు. 

కరీంనగర్ పరిధిలో 175 మంది రౌడీ షీటర్లు

కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 175 మంది రౌడీషీటర్లు ఉన్నారని, సత్ప్రవర్తనతో ఉంటే నెల రోజుల్లోగా షీట్లు ఎత్తేస్తామని కరీంనగర్​సీపీ సత్యనారాయణ తెలిపారు. బుధవారం నగరలోని పోలీస్ కమిషనరేట్​లో రౌడీషీటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారిని, 60 ఏళ్ల పైబడిన వారిని షీట్ల నుంచి తప్పిస్తామన్నారు. కరీంనగర్ కార్పొరేటర్ జంగిలి సాగర్ పై తరుచూ ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఎవరైనా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎవరైనా గొడవల్లో తలదూరిస్తే పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై, అన్ లైన్ మోసాలు, హత్యకేసులు, పోక్సో కేసుల్లో, లోన్ యాప్ నిందితులపై షీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. షీట్ ఎత్తివేసిన తర్వాత మళ్లీ ఏ చిన్న కేసులో ఇన్​వాల్వ్ అయినా కొత్త షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. 

ఆస్తిపన్ను వసూళ్లలో రామగుండం సెకండ్‌‌‌‌

గోదావరిఖని, వెలుగు: ఆస్తి పన్నుపై 90 శాతం వడ్డీ మాఫీ అవకాశాన్ని కల్పించిన నేపథ్యంలో పన్ను వసూళ్లలో వరంగల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ తర్వాత రామగుండం కార్పొరేషన్‌‌‌‌ సెకండ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచింది. రామగుండం‌‌లో మొత్తం 14,935 నిర్మాణాలున్నాయి. రూ.4.03 కోట్ల అసలుతోపాటు రూ.3.52 కోట్ల పెనాల్టీ వసూలు కావాల్సి ఉండగా 90 శాతం వడ్డీ మాఫీతో అది రూ.35.26 లక్షలకు తగ్గింది. అసలులో రూ.71.95 లక్షలు, పెనాల్టీ రూ.4.75 లక్షలు కలిపి రూ.76.70 లక్షలను రెవెన్యూ సిబ్బంది వసూలు  చేశారు. వరంగల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ 30.09 శాతం, రామగుండం 17.48 శాతం, కరీంనగర్ 16.71 శాతం, నిజామాబాద్ 16.67 శాతం, ఖమ్మం 12.75 శాతం వసూళ్లు సాధించాయి.

  • ఆయిల్ పామ్ పై అవగాహన కల్పించాలి
  • నర్సరీ ని పరిశీలించిన కలెక్టర్ రవి

గొల్లపల్లి, వెలుగు : ఆయిల్ పామ్ తోటల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించాలని జగిత్యాల కలెక్టర్ రవి హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. బుధవారం గొల్లపల్లి మండలం అబ్బాపూర్ లో ఆయిల్​పామ్​నర్సరీని పరిశీలించారు. మలేసియా, ఇండోనేషియా దేశాల నుంచి 5లక్షల 35వేల నారును తీసుకువచ్చి పెంచుతున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులకు 2023 ఫిబ్రవరి నుంచి మొక్కలు సబ్సిడీపై అందిస్తామన్నారు. జగిత్యాల జిల్లాలో 9వేల ఎకరాలలో సాగు చేయడానికి ఏర్పాట్లు జరుతున్నాయని, ఇప్పటికి 2,400 ఎకరాల్లో సాగు చేయడానికి దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆయన వెంట జిల్లా హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులు ఉన్నారు.

కాంగ్రెస్ ​ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

హుజూరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి బలమురి వెంకట్ జన్మదినం సందర్భంగా బుధవారం పార్టీ ఆఫీస్​లో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు కేక్​ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు. అన్నదానం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు కొల్లూరు కిరణ్ నాయకులు బాబు, సుశీల, పుష్పలత, అప్సర్ తదితరులు  పాల్గొన్నారు.

10 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు 

జగిత్యాల, వెలుగు: పట్టణానికి చెందిన 10 మందిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంజీవ్ బుధవారం తెలిపారు. పట్టణంలోని చిలుకవాడకు చెందిన చెంగల్ మోహన్ అనే వ్యక్తి బీట్ బజార్ లోని ధన్వంతరి టెంపుల్ వద్ద 12 గుంటల స్థలం కొని ఇంటి నిర్మాణం చేపట్టాడు. మూడు రోజుల క్రితం జగిత్యాల పట్టణానికి చెందిన పులి రమేశ్​గౌడ్, ముజాహిద్, మరో 8 మంది కులం పేరుతో దూషిస్తూ నిర్మాణ పనులు అడ్డుకున్నారని, బ్లేడ్ టాక్టర్ తో ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. విచారణ చేసి నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంజీవ్ 
తెలిపారు.

గ్రామాల్లో ట్రైనీ ఐఏఎస్​ల స్టడీ

తిమ్మాపూర్, వెలుగు: ట్రైనీ ఐఏఎస్​ ఆఫీసర్లు తమ శిక్షణలో భాగంగా పలు గ్రామాలను సందర్శిస్తున్నారు. బుధవారం తిమ్మాపూర్​మండలకేంద్రంలోని అంగన్​వాడీ కేంద్రం, ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. మహాత్మా నగర్ గ్రామంలోని ఉర్దూ, తెలుగు, మీడియం స్కూళ్లు, మిషన్ భగీరథ ఫిల్టర్ హౌస్ ను పరిశీలించారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. 

గంగాధర: మండలంలోని మధురానగర్ లో బుధవా రం ట్రైనీ ఐఏఎస్​ అధికారులు లేఖరాజ్​ మీనా, ప్రభాత్ జ్ఞానేంద్రసింగ్, అనికేత్, గణేశ్, విశాల్​ పర్యటించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల జీవన స్థితిగతులను, వృత్తులు, ఆదాయ మార్గాలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని అంగన్​వాడీ కేంద్రాలు, పల్లెప్రకృతి వనం పరిశీలించారు. 

‘క్యాప్​ జెమిని’లో గాయత్రి స్టూడెంట్ కు ప్లేస్​మెంట్​

పెద్దపల్లి, వెలుగు: ప్రముఖ సాఫ్ట్​వేర్ కంపెనీ క్యాప్ జెమిని టెక్నాలజీలో పెద్దపల్లి గాయత్రి డిగ్రీ, పీజీ కాలేజీ చెందిన స్టూడెంట్ దాసి కళ్యాణి ఉద్యోగం సాధించింది.  బుధవారం కాలేజీలోఏర్పాటు చేసిన సమావేశంలో గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు. కాలేజీ స్టూడెంట్లకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉద్యోగం సాధించడానికి అవసరమయ్యే శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ సందర్భంగా లెక్చరర్లకు కళ్యాణిని అభినందించారు.

లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలి: కలెక్టర్ కర్ణన్  

హుజూరాబాద్,​ వెలుగు: దళితబంధు పథకంతో నెలకొల్పిన యూనిట్లను బాగా నడిపి ఆర్థికంగా ఎదగాలని కరీంనగర్​కలెక్టర్ కర్ణన్ లబ్ధిదారులకు సూచించారు. బుధవారం  జమ్మికుంట, హుజూరాబాద్ మండల కేంద్రాలలో దళిత బంధు పథకం కింద గ్రౌండింగ్ చేసిన యూనిట్లను ఆయన పరిశీలించి యూనిట్ల అభివృద్ధి, లాభాల గురించి తెలుసుకున్నారు. మొదటి దశలో యూనిట్లను గ్రౌండింగ్ చేసేందుకు రూ.5లక్షలు ఇచ్చామని, మిగిలిన రూ.5 లక్షలు  మంజూరు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి సురేశ్, జిల్లా సహకార అధికారి శ్రీమాల సిబ్బంది ఉన్నారు.

జీడీకే 7 ఎల్‌‌ఈపీ మైన్‌‌‌‌ కోసం నేడు పబ్లిక్‌‌‌‌ హియరింగ్‌‌‌‌

గోదావరిఖని, వెలుగు: సింగరేణి రామగుండం రీజియన్‌‌‌‌ పరిధి ఆర్జీ 2 ఏరియాలోగల జీడీకే 7 ఎల్‌‌ఈపీ మైన్‌‌‌‌ కోసం గురువారం పబ్లిక్‌‌‌‌ హియరింగ్‌‌‌‌ నిర్వహిస్తున్నారు. కలెక్టర్‌‌‌‌తో పాటు పొల్యూషన్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ బోర్డు ఆఫీసర్ల పర్యవేక్షణలో హియరింగ్‌‌‌‌ జరగనున్నది. 1991 నుంచి ఈ గనిలో బొగ్గు ఉత్పత్తి మొదలు పెట్టగా దాదాపు 48 లక్షల టన్నుల బొగ్గును వెలికి తీశారు. 2022 మార్చి వరకు మరో 5 లక్షల టన్నుల బొగ్గు తీసే అవకాశం ఉన్నా 2021 నవంబర్‌‌‌‌లోనే ఉత్పత్తి నిలిపేశారు. అయితే 1994 కంటే ముందు ప్రారంభించిన బొగ్గు గనులలో అనుమతికి మించి బొగ్గు ఉత్పత్తి చేస్తే ప్రజాభిప్రాయం సేకరించాలని 2004లో కేంద్ర పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గనిలో సుమారు 3 వేల టన్నుల బొగ్గు అధికంగా ఉత్పత్తి చేసిన నేపథ్యంలో గురువారం పబ్లిక్‌‌‌‌ హియరింగ్‌‌‌‌ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.