పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు : మోదీ

పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు : మోదీ

జనవరి 25న వెలువడిన ప్రకటన ప్రకారం.. పద్మ అవార్డులు పొందిన వారందరికీ ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. భారతదేశం విభిన్న రంగాలలోని వారి సేవలను ఎంతో ఆదరిస్తోందన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, నటులు వైజయంతిమాల బాలి, కొణిదెల చిరంజీవి, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు దివంగత బిందేశ్వర్ పాఠక్, సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి దివంగత ఎం ఫాతిమా బీవీ, బాంబే సమాచార్ యజమాని హార్ముస్జీ ఎన్ కామా సహా 132 మంది ప్రముఖులకు గురువారం పద్మ అవార్డులు లభించాయి.

ఈ సందర్భంగా Xలో పోస్ట్‌లో చేసిన మోదీ.. పద్మ అవార్డులు పొందిన వారందరికీ అభినందనలని చెప్పారు. భారతదేశం విభిన్న రంగాలలో వారి సహకారాన్ని గౌరవిస్తుందన్నారు. వారు తమ అసాధారణమైన పనితో ప్రజలను ప్రేరేపించడం ఇలాగే కొనసాగించాలని కోరారు. అంతకుముందు నటుడు మిథున్ చక్రవర్తి, తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియు, బిజెపి సీనియర్ రామ్ నాయక్, నటుడు దివంగత విజయకాంత్, గాయని ఉషా ఉతుప్, కిరణ్ నాడార్‌లకు కూడా 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పౌర పురస్కారాలు లభించాయని అధికారిక ప్రకటన తెలిపింది.

భారతరత్న:

రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్పూరీ ఠాకూర్‌కు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు ప్రభుత్వం మంగళవారం (జనవరి 23) ప్రకటించింది.