Padma awards 2023: కీరవాణికి పద్మశ్రీ.. చినజీయర్‌ స్వామికి పద్మభూషణ్‌

Padma awards 2023:  కీరవాణికి పద్మశ్రీ.. చినజీయర్‌ స్వామికి పద్మభూషణ్‌

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటడంలో కృషి చేసినందుకు గానూ ఏపీ నుంచి  ఈ ఆవార్డుకు ఆయన ఎంపిక అయ్యారు. అటు తెలంగాణ నుంచి అధ్యాత్మిక రంగంలో చినజీయర్  స్వామి, కమలేశ్‌ డి పటేల్‌లకు పద్మభూషణ్ అవార్డు లభించింది. ఈ ఏడాదికి గాను మొత్తంగా 106 పద్మ పురస్కాలు ప్రకటించిన కేంద్రం  వీటిలో ఆరుగురిని పద్మవిభూషణ్‌, తొమ్మిది మందిని పద్మభూషణ్‌, 91మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12మందిని పద్మ పురస్కారాలు వరించాయి.

 


తెలంగాణ నుంచి పద్మశ్రీ 

  • మోదాడుగు విజయ్‌ గుప్తా (సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌)
  • బి.రామకృష్ణా రెడ్డి(లిటరేచర్ &ఎడ్యుకేషన్)
  • హనుమంతరావు పసుపులేటి (వైద్యం)


ఆంధ్రప్రదేశ్‌ నుంచి పద్మశ్రీ

  • ఎం.ఎం.కీరవాణి (కళలు)
  • గణేశ్‌ నాగప్ప కృష్ణరాజనగర
  •  అబ్బారెడ్డి నాగేశ్వరరావు; (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌)
  •  సీవీ రాజు
  •  కోట సచ్చిదానంద శాస్త్రి (ఆర్ట్‌)
  • సంకురాత్రి చంద్రశేఖర్‌ (సామాజిక సేవ)
  •  ప్రకాశ్‌ చంద్రసూద్‌ (సాహిత్యం, విద్య విభాగంలో)