పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా ట్రాన్స్‌జెండర్

పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా ట్రాన్స్‌జెండర్

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో ఈ రోజు ఉదయం జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఓ సరదా సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఓ ట్రాన్స్‌జెండర్ తనదైన స్టైల్‌లో దిష్టి తీసింది. దేశ చరిత్రలోనే పద్మ శ్రీ పురస్కారానికి ఎంపికైన తొలి ట్రాన్స్‌జెండర్ ఆమె. 2021 ఏడాదికి గానూ మొత్తం 119 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో ఏడుగురికి పద్మ భూషణ్, 10 మందికి పద్మ విభూషణ్, 102 మందికి పద్మ శ్రీ అవార్డులకు ఎంపిక చేయగా.. వారిలో ఓ ట్రాన్స్‌జెండర్ కూడా ఉండడం విశేషం. ఈ ట్రాన్స్‌జెండర్‌‌ పేరు మాతా బి. మంజమ్మ జోగతి. ఫోక్‌ డ్యాన్సర్, సింగర్‌‌ అయిన మంజమ్మ ప్రస్తుతం కర్ణాటక జానపద అకాడమీ ప్రెసిండెంట్‌గా సేవలు అందిస్తున్నారు. ఈ రోజు ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కోవింద్‌కు దిష్టి తీసి.. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

గాన గందర్వుడు ఎస్పీ బాలుకు పద్మ విభూషణ్​

లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్‌.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా  పద్మ భూషణ్‌ అవార్డును అందుకున్నారు. పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికైన అస్సాం దివంగత మాజీ సీఎం తరుణ్ గొగోయ్‌ తరఫున ఆయన భార్య డాలీ గొగోయ్.. కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తరఫున ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ అవార్డులను స్వీకరించారు. అలాగే ప్రముఖ శిల్పి సుదర్శన్ సాహూకు రాష్ట్రపతి పద్మ భూషణ్‌ పురస్కారాన్ని అందజేశారు. కాగా, ఆర్ట్స్ కేటగిరీలో సింగర్ చిత్ర పద్మ భూషణ్, దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం పద్మ విభూషణ్ అవార్డుకు, తెలంగాణ నుంచి గుస్సాడీ కనకరాజు పద్మ శ్రీకి ఎంపికయ్యారు.  ఎస్పీబీ అవార్డును ఆయన కుమారుడు చరణ్ అందుకున్నారు.

మరిన్ని వార్తల కోసం..

హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ పొడిగింపు

దేశంలో శాశ్వతంగా ఉండేది కాంగ్రెస్ పార్టీనే

ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌‌ఎస్ ధర్నాలు