
ముంబైలో జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో (ఐఐజేఎస్) లో శివ నారాయణ్ జ్యూయలర్స్ అనంత పద్మనాభ స్వామి కళాఖండాన్ని ప్రదర్శించింది. విగ్రహం 8 అంగుళాల ఎత్తు 18 అంగుళాల పొడవు ఉంటుంది. రెండు నెలల పాటు ప్రతిరోజూ 16 గంటల చొప్పున పనిచేసి 32 మంది కళాకారులు దీనిని తయారు చేశారు. దీని బరువు 2.8 కిలోలు. ఈ కళాఖండం కోసం దాదాపు 75 వేల వజ్రాలు వాడామని హైదరాబాద్కు చెందిన ఈ సంస్థ తెలిపింది.