మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నం :  పద్మారావు గౌడ్

మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నం :  పద్మారావు గౌడ్

సికింద్రాబాద్, వెలుగు: మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సికింద్రాబాద్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ తెలిపారు. శుక్రవారం సెగ్మెంట్ పరిధిలోని మసీదులకు వెళ్లి ముస్లిం నేతలను ఆయన మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. చిలకలగూడ బడే మసీదు, చోటే మసీదు, ఏక్ మినార్ మసీదు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. ఇమామ్, మౌజన్​ల గౌరవ వేతనం పెంచి మైనార్టీల విద్యావకాశాలను మెరుగుపరచామన్నారు. సికింద్రాబాద్​లోని ఈద్గాల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం మైనార్టీ సంఘాల నేతలు పద్మారావు గౌడ్​ను కలిసి మద్దతు ప్రకటించారు.

ఆయన వెంట కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసురి సునీత, నేతలు కిషోర్ కుమార్, కిరణ్ కుమార్, రామేశ్వర్ గౌడ్, కరాటే రాజు ఉన్నారు. --ఉస్మానియా వర్సిటీ స్టూడెంట్ జేఏసీ.. పద్మారావు గౌడ్​కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. చిలకలగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం ఆయనతో సమావేశమైంది. తెలంగాణా ఉద్యమ సమయంలో పద్మారావు గౌడ్ కీలక పాత్ర పోషించి స్టూడెంట్లకు అండగా నిలిచారని దత్తాత్రేయ తెలిపారు.