Pawan Kalyan: కావలిలో మధుసూదన రావుకు నివాళులు అర్పించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: కావలిలో మధుసూదన రావుకు నివాళులు అర్పించిన పవన్ కళ్యాణ్

కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన నెల్లూరు కావలి వాసి మధుసూదనరావు మృతదేహానికి నివాళులు అర్పించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గురువారం (ఏప్రిల్ 24) కావలిలోని మృతుని స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉగ్రదాడిలో చనిపోవడం బాధాకరమైన విషయమని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని చెప్పారు. 

జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం లో బుధవారం (ఏప్రిల్ 23) ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది టూరిస్టులు చనిపోవడం ప్రపంచం నివ్వెరపోయింది. అదే విధంగా మరో 20 మందికిపైగా గాయాలపాలయ్యారు.