- ప్రారంభించిన సొసైటీ అధ్యక్షుడు ఎంవీ రమణారెడ్డి
బషీర్ బాగ్, వెలుగు: యువ చిత్ర కళాకారులను ప్రోత్సహించి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ పనిచేస్తుందని సొసైటీ అధ్యక్షుడు ఎంవీ రమణా రెడ్డి తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న నుమాయిష్ లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ లో దేశవ్యాప్తంగా ఉన్న యువ కళాకారులు గీసిన పెయింటింగ్స్ ను ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా ఎంవీ రమణా రెడ్డి మాట్లాడుతూ..
15 రోజుల పాటు ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని, నుమాయిష్‌కు వచ్చే సందర్శకులు వీటిని చూడొచ్చని పేర్కొన్నారు. కళాకారులను ప్రోత్సహించేందుకు వారికి క్యాష్ ప్రైజ్ తో పాటు గోల్డ్ , సిల్వర్ , బ్రౌంజ్ మెడల్స్ ను అందజేస్తామన్నారు. ఫస్ట్ ప్రైజ్ కు రూ.35 వేలు, సెకండ్, థర్డ్ ప్రైజ్ లకు రూ.30 వేలు, రూ.25 వేలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సత్యేందర్ వనం, సెక్రటరీ హనుమంతరావు, జాయింట్ సెక్రటరీ చంద్రజిత్ సింగ్, ట్రెజరర్ రాజేందర్ కుమార్ పాల్గొన్నారు.