370 ఆర్టికల్‌‌ను పునరుద్ధరించాలి

370 ఆర్టికల్‌‌ను పునరుద్ధరించాలి

పాక్ దేశానికి నూతనంగా ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. ఆసియాలో శాంతి కోసం జమ్ము కశ్మీర్ లో వెంటనే 370 ఆర్టికల్ ను పునరుద్ధరించాలని భారత్ కు సూచించారు. ఈ ఆర్టికల్ ను పునరుద్ధరిస్తే జమ్మూ కశ్మీర్ సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకోగలమని వ్యాఖ్యానించారు. ఆసియాలో శాంతి కోసం 2019, ఆగస్టు 05వ తేదీన ఏకపక్ష, చట్ట విరుద్ధమైన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం భారత్ బాధ్యత అని చెప్పారు. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. భవిష్యత్ తరాలు బాధ పడాలని ఎవరూ కోరుకోరని, ఐక్యరాజ్య సమితి తీర్మానాలు.. కశ్మీర్ ల అంచనాలకు అనుగుణంగా సమస్యను పరిష్కరిద్దామన్నారు. ఈ సమస్య పరిష్కారమవుతే పేదరికాన్ని అంతం చేయగలుగుతామన్నారు. 

ప్రసంగంలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై పలు విమర్శలు గుప్పించారు. విదేశీ కుట్ర ఆరోపణలను ఆయన ఖండించారు. పెరిగిపోతున్న రుణాలు, ద్రవ్యోల్బణం, దేశంలోని ఆర్థిక ఇబ్బందులు.. ప్రధాన సమస్యలపై ఇమ్రాన్ ఖాన్ లపై ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా వాస్తవాలను దాచి పెడుతోందని, IMFతో ఒప్పందం కుదుర్చుకున్నారని వారికి గుర్తు చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. వారి కఠినమైన నిబంధనలను అంగీకరించారని, దీని ఫలితంగా దేశాన్ని ఆర్థిక గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్లిందని వెల్లడించారు. పాక్ లో పెట్రోల్ ధరలు పెంచడం మినహా వేరే మార్గం లేదని ఆర్థిక మంత్రి ఇస్మాయిల్ వెల్లడించారు. తాజాగా పాక్ ప్రధాని చేసిన కశ్మీర్ అంశంపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని వార్తల కోసం

ఆన్ లైన్‌‌లో స్విమ్మింగ్ టెస్టు.. వర్సిటీ నిర్ణయం


అయ్యో పాపం.. చిన్నారి