ఆన్ లైన్‌‌లో స్విమ్మింగ్ టెస్టు.. వర్సిటీ నిర్ణయం

ఆన్ లైన్‌‌లో స్విమ్మింగ్ టెస్టు.. వర్సిటీ నిర్ణయం

స్విమ్మింగ్ టెస్టును ఆన్ లైన్‌‌లో చేయాలా ? ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా ? అవును దీనిని చూసిన విద్యార్థులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంట్లోని బాత్ టబ్ లో ఈత కొడుతారా ? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చైనాలోని ఓ యూనివర్సిటీ స్విమ్మింగ్ పరీక్షను ఆన్‌‌లైన్‌‌లో రాయమని సూచించడంతో విద్యార్థులు అవాక్కయ్యారు. గ్రాడ్యుయేషన్ కు ముందు 50 మీటర్ల స్విమ్మింగ్ పరీక్షను పూర్తి చేయని అండర్ గ్రాడ్యుయేట్లు ఇంటి నుంచి ఆన్ లైన్ లో పరీక్షలో పాల్గొనవచ్చని షాంఘై విశ్వవిద్యాలయం పేర్కొంది. చైనాలోని విశ్వ విద్యాలయాల్లో గ్రాడ్యుయేట్ చేయడానికి ముందు ఈత నేర్చుకోవాలనే నిబంధన ఉంది. విద్యార్థులు మనుగడ సాధించడంతో పాటు.. ఫిట్ నెస్ మెరుగుపరుస్తుందని వర్సిటీలు భావిస్తాయి.

ప్రస్తుతం కరోనా ఏలా విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. ప్రధానంగా షాంఘైలో వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దీంతో కఠిన నిబంధనలు, ఆంక్షలు అమలు చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో.. ఆన్ లైన్ స్విమ్మింగ్ పరీక్ష కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. యూనివర్సిటీలోని కోవిడ్-19 కారణంగా కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా.. పూల్ లో తరగతులు, సౌకర్యాలు నిలిపివేశారు. విద్యార్థులు గ్రాడ్యుయేట్ చేయడానికి స్విమ్మింగ్ పరీక్షను ఆన్ లైన్ లో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు డీన్ కార్యాలయానికి చెందిన ఓ వ్యక్తి వెల్లడించినట్లు ఓ జాతీయ పత్రిక వెల్లడించింది. ఆన్ లైన్ ద్వారా స్విమ్మింగ్ పరీక్ష పూర్తి చేయడానికి విద్యార్థులు క్యాంపస్ నెట్ వర్క్ కు ముందుగా లాగిన్ కావాలి. అనంతరం ప్రశ్నాపత్రానికి సమాధానం ఇవ్వాలి. ఆన్ లైన్ లో నిర్వహించాలన్న యూనివర్సిటీ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు వెరైటీగా స్పందిస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం :-

రుతుపవనాలు ఆలస్యం!.. IMD అంచనా


పెళ్లివేడుకలో ఆడిపాడిన సైనికులు