సీఐఏకు లాడెన్‌‌ సమాచారమిచ్చింది ఐఎస్‌ఐనే : ఇమ్రాన్‌‌

సీఐఏకు లాడెన్‌‌ సమాచారమిచ్చింది ఐఎస్‌ఐనే : ఇమ్రాన్‌‌

వాషింగ్టన్‌‌: అల్‌‌ఖైదా చీఫ్‌‌ ఒసామా బిన్‌‌ లాడెన్‌‌ను అమెరికా చంపడానికి సెంట్రల్‌‌ ఇంటెలిజన్స్‌‌ ఏజెన్సీ కి (సీఐఏ) ఇంటర్‌‌‌‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌‌ (ఐఎస్‌ ఐ) సమాచారం ఇచ్చిందని పాకిస్తాన్‌‌ ప్రధాని ఇమ్రాన్‌‌ ఖాన్‌‌ మొదటిసారి ఒప్పుకున్నారు. అమెరికా చంపేవరకు లాడెన్‌‌ ఎక్కడున్నాడో తమకు తెలియదని కొంతకాలంగా పాకిస్తాన్‌‌ బుకాయిస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్‌‌ ‘ఫాక్స్‌‌’ న్యూస్‌ చానల్‌‌ ఇంటర్వ్యూలో వెల్లడించడంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. “ అమెరికా మిత్రదేశమైనా మమ్మల్ని నమ్మలేదు. మా దేశంలోకి దూసుకొచ్చి లాడెన్‌‌ను వాళ్లే చంపేశారు” అని ఇమ్రాన్‌‌ ఖాన్‌‌ చెప్పారు. లాడెన్‌‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో పాక్‌ 70 వేల మందిని కోల్పోవాల్సి వచ్చిందన్నారు.

రెండు దేశాలు పరిష్కరించుకోలేవు..

గొడవలకు దారితీస్తున్న అంశాలను ఇండియా – పాకిస్తాన్‌‌లు పరిష్కరించుకోలేవని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌‌ఖాన్‌‌ చెప్పారు. కాశ్మీర్‌‌ మీడియేషన్‌‌పై ట్రంప్‌ కామెంట్స్‌‌ చేసిన తర్వాత ఇమ్రాన్‌‌ మంగళవారం ఈ కామెంట్స్‌‌ చేశారు.