ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌‌‌‌లో.. పాకిస్తాన్‌‌‌‌ 313 ఆలౌట్‌‌‌‌

ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌‌‌‌లో.. పాకిస్తాన్‌‌‌‌ 313 ఆలౌట్‌‌‌‌

సిడ్నీ: ఆస్ట్రేలియాతో బుధవారం ప్రారంభమైన మూడో టెస్ట్‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌ తడబడి కోలుకుంది. మహ్మద్‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌ (88), అమెర్‌‌‌‌ జమాల్‌‌‌‌ (82), ఆగా సల్మాన్‌‌‌‌ (53) హాఫ్‌‌‌‌ సెంచరీలు సాధించడంతో పాక్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 77.1 ఓవర్లలో 313 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. టాస్‌‌‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన పాక్‌‌‌‌ను ఆరంభంలో ఆసీస్‌‌‌‌ పేసర్లు ఘోరంగా దెబ్బకొట్టారు. 

అబ్దుల్లా షఫీక్‌‌‌‌ (0), సయీమ్‌‌‌‌ అయూబ్‌‌‌‌ (0), షాన్‌‌‌‌ మసూద్‌‌‌‌ (35), బాబర్‌‌‌‌ ఆజమ్‌‌‌‌ (26), సౌద్‌‌‌‌ షకీల్‌‌‌‌ (5) ఫెయిల్‌‌‌‌ కావడంతో పాక్‌‌‌‌ 96/5తో కష్టాల్లో పడింది. ఈ దశలో రిజ్వాన్‌‌‌‌, సల్మాన్‌‌‌‌ ఆరో వికెట్‌‌‌‌కు 94 రన్స్‌‌‌‌ జోడించి ఇన్నింగ్స్‌‌‌‌ను నిలబెట్టారు. చివర్లో హసన్‌‌‌‌ అలీ (0) ఫెయిలైనా, జమాల్‌‌‌‌, మిర్‌‌‌‌ హమ్జా (7 నాటౌట్‌‌‌‌) పదో వికెట్‌‌‌‌కు 86 రన్స్‌‌‌‌ జత చేసి మంచి స్కోరును అందించారు. కమిన్స్‌‌‌‌ (5/61) వరుసగా మూడోసారి ఐదు వికెట్ల హాల్‌‌‌‌ సాధించాడు. 

తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఆసీస్‌‌‌‌ ఆట ముగిసే టైమ్‌‌‌‌కు తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 1 ఓవర్‌‌‌‌లో 6/0 స్కోరు చేసింది. వార్నర్‌‌‌‌ (6 బ్యాటింగ్‌‌‌‌), ఉస్మాన్‌‌‌‌ ఖవాజ (0 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. స్టార్క్‌‌‌‌ 2 వికెట్లు తీశాడు. కెరీర్‌‌‌‌లో చివరి టెస్ట్‌‌‌‌ ఆడుతున్న వార్నర్‌‌‌‌కు పాక్‌‌‌‌ ‘గార్డ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఆనర్‌‌‌‌’తో గౌరవ వందనం చేసింది.