
జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ లో లేదని అన్నారు ఆ దేశ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్. జైషే ను ఐక్యరాజ్యసమితితో పాటు.. పాకిస్తాన్ కూడా నిషేధించిందని ఆసిఫ్ చెప్పారు . అయితే.. రెండు రోజుల క్రితం పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఖురేషీ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ… జైషే చీఫ్ మసూద్ హజర్ పాకిస్తాన్ లోనే ఉన్నాడని, కదలలేని స్ధితిలో వైద్యం పొందుతున్నాడని చెప్పారు.
పుల్వామా దాడికి బాధ్యులైన జైషే సంస్థ చీఫ్ మసూద్ పై చర్యలు తీసుకోవాలని పాక్ ను భారత్ కోరగా… అసలు ఆ సంస్థే తమ దేశంలో లేదనడం గమనార్హం.