
పాక్ మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను వెంటనే తప్పించాలని పాక్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పాకిస్థాన్ మానవ హక్కుల శాఖ మంత్రి షిరీన్ మజారీ ఐక్యరాజ్యసమితికి లెటర్ రాశారు. కశ్మీర్ అంశంతో పాటు పాక్ పై అణుదాడి చేస్తామన్న భారత్‌కు ప్రియాంక చోప్రా బహిరంగంగా మద్దతు పలికారని మజారీ ఐరాసకు రాసిన లేఖలో వివరించారు. శాంతి దూతగా ఉండాల్సిన అర్హత ప్రియాంక చోప్రాకు లేదని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం కాశ్మీర్ లో ప్రజల హక్కులను కాలరాస్తోందని… అలాంటి ప్రభుత్వానికి, ప్రభుత్వ సారథ్యంలోని ఆర్మీకి ప్రియాంక చోప్రా ఎలా మద్దతు పలుకుతారని మజారీ ప్రశ్నించారు.
వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే ప్రియాంక చోప్రా ఐరాస గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి అనర్హురాలని మంత్రి మజారీ ఆరోపించారు. వెంటనే ఆమెను తొలగించాలని కోరారు. బాలాకోట్‌లో భారత ఆర్మీ జరిపిన వైమానిక దాడులను ట్విట్టర్ ద్వారా ప్రియాంక చోప్రా సమర్థించడంతో… అప్పటి నుంచి ఆమెను పాకిస్థాన్ టార్గెట్ చేస్తూ వస్తోంది.