పాకిస్థాన్ క్రికెట్ జట్టు రానున్న రెండు నెలలు వన్డే, టీ20 సిరీస్ లతో బిజీ కానుంది. వరుసగా సౌతాఫ్రికా, శ్రీలంక, ట్రై సిరీస్ లు ఆడనుంది. ఈ మూడు సిరీస్ లకు పాకిస్థాన్ వన్డే, టీ20 స్క్వాడ్ ను ప్రకటించారు. 15 మందితో కూడిన స్క్వాడ్ ను శుక్రవారం (అక్టోబర్ 24) ప్రకటించారు. స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ టీ20 జట్టులో ఏడాదహి తర్వాత స్థానం సంపాదించాడు. డిసెంబర్ 2024లో సౌతాఫ్రికాతో చివరిసారిగా టీ20 సిరీస్ ఆడిన పాకిస్థాన్ 10 నెలల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ క్రమంలో బాబర్ బంగ్లాదేశ్, వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్ లతో పాటు ఆసియా కప్ కు దూరమయ్యాడు.
2026 టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని బాబర్ లాంటి అనుభవజ్ఞుడిని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. ఇటీవలే జరిగిన ఆసియా కప్ టోర్నీలో టీమిండియాపై పాకిస్థాన్ మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. బాబర్ జట్టులో ఉండాలని.. అతని అనుభవం జట్టుకు పనికొస్తుందని పాక్ సెలక్టర్లు ఈ స్టార్ బ్యాటర్ ను మళ్ళీ టీ20 జట్టులోకి తీసుకొని వచ్చారు. బాబర్ తో పాటు యువ ఫాస్ట్ బౌలర్ నసీం షా కు టీ20 జట్టులో చోటు కల్పించారు. 24 ఏళ్ల స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ జాతీయ జట్టుకు తొలిసారిగా ఎంపికయ్యాడు. పేలవ ఫామ్ లో ఉన్న ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్, ఫఖర్ జమాన్‌లను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు.
అక్టోబర్, నవంబర్‌లలో పాకిస్తాన్ స్వదేశంలో వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా సౌతాఫ్రికాతో మొదట మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్ అక్టోబర్ 28 నుండి నవంబర్ 1 వరకు జరుగుతుంది. రావల్పిండి, లాహోర్‌లలో మ్యాచ్ లు జరుగుతాయి. ఆ తర్వాత నవంబర్ 4 నుండి 8 వరకు ఫైసలాబాద్‌లో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఉంటుంది. నవంబర్ 11 నుండి 15 వరకు రావల్పిండిలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కు శ్రీలంకకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుంది. నవంబర్ 17 నుండి 29 వరకు జరగనున్న శ్రీలంక, జింబాబ్వేలతో ట్రై సిరీస్ ఆడనుంది.
పాకిస్థాన్ టీ20 జట్టు:
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్ , బాబర్ అజామ్, ఫహీమ్ అష్రఫ్, హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షహీన్ అయూబ్, షాహీన్ అయూబ్, షాహీన్ ఖాన్.
రిజర్వ్ ప్లేయర్స్: ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, సుఫియాన్ మోకిమ్
పాకిస్థాన్ వన్డే జట్టు:
షాహీన్ షా అఫ్రిది (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫైసల్ అక్రమ్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసీబుల్లా, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా
