కోహ్లి నా ఫేవరేట్.. పాక్ క్రికెటర్ భార్య సంచలన కామెంట్స్

V6 Velugu Posted on Jun 06, 2021

  • లైవ్ ఛాట్ లో నెటిజన్ల ప్రశ్నలకు జవాబిచ్చిన షామియా అర్జూ
  • హసన్ అలీని ప్రేమించి పెళ్లి చేసుకున్న హర్యానాకు చెందిన షామియా అర్జూ

ప్రపంచ క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించే వార్త. ముఖ్యంగా దాయది దేశం పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు ఏ మాత్రం రుచించని చేదు వార్త క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. పాకిస్తాన్ కు చెందిన హసన్ అలీ భార్య సోషల్ మీడియాలో లైవ్ ఛాట్ నిర్వహిస్తూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు చకచకా జవాబులు చెప్పింది. ఓ అభిమాని మీ ఫెవరేట్ క్రికెటర్.. బ్యాట్స్ మెన్ ఎవరు ? అని అడిగిందే ఆలస్యం... విరాట్ కొహ్లి అని ఠకీమని జవాబిచ్చింది. తొలుత తొండరపడిందేమో.. పొరపాటు పడిందేమోననుకున్నారు. అయితే కోహ్లి బ్యాటింగ్ విన్యాసాల గురించి పొగడడంతో నిజమేనని నిర్దారణ అయింది. ఇది కాస్తా ఇప్పుడు ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో వైరల్ అవుతూ ట్రెండింగ్ గా నిలుస్తోంది. 
ఎమిరేట్ ఎయిర్ లైన్స్ లో ఫ్లయిట్ ఇంజనీర్ గా పనిచేసిన షామియా అర్జూ తరచూ విదేశీయానాలు చేస్తున్న సమయంలో పాక్ బౌలర్ హసన్ అలీ పరిచయం అయ్యాడు. వీరి పరిచయం కాస్తా ప్రేమ దాకా వెళ్లింది. చివరకు రెండేళ్ల క్రితం ప్రేమ పెళ్లిగా మారింది. వీరి ప్రేమ పెళ్లి తర్వాత హసన్ అలీ పాక్ జట్టులో ప్రధాన బౌలర్ గా ఎదిగి కీలక ఆటగాడిగా రాణిస్తున్నాడు. ఈ నేపధ్యంలో అతడి భార్య అయిన షామియా అర్జూ తన ఫేవరేట్ క్రికెటర్ విరాట్ కోహ్లి అని చెప్పడం సంచలంన రేపింది. అయితే ఇది ఇరుదేశాల మధ్య సన్నిహితం చేసే చర్య అవుతుందంటూ పలువురు నెటిజన్లు స్వాగతిస్తున్నారు. 

Tagged Shamia Arzoo, , Pakistan cricket pace bowler, Hasan Ali’s wife name, Virat Kohli as her favourite batsman, Hasan Ali\'s Wife, Hassan ali wife comments, sharmia Arzoo native Haryana, Shamia Arzoo indian

Latest Videos

Subscribe Now

More News