LOC వెంబడి 100 కమాండో గ్రూప్‌లను మోహరించిన పాక్

LOC వెంబడి 100 కమాండో గ్రూప్‌లను మోహరించిన పాక్

సరిహద్దులోని నియంత్రణ రేఖ దగ్గర పాకిస్థాన్ ఆపరేషన్స్ మరింత వేగవంతం చేసింది. ఇండియన్ ఆర్మీపై ఏదో దాడికి కుట్ర పన్నినట్టుగా భారత భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. 100 స్పెషల్ సర్వీస్ గ్రూప్ – SSG కమాండో బలగాలను లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాకిస్థాన్ ఆర్మీ లేటెస్ట్ గా మోహరించింది.

ఈ కమాండోల మోహరింపు.. వారి ఆపరేషన్స్ ను భారత ఆర్మీ జాగ్రత్తగా గమనిస్తోంది. ఈ కమాండోలు.. జైష్ ఎ మహ్మద్ సహా ఇతర పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో కలిసి గతంలో దాడి చేసిన వారేనని భారత సైన్యం చెబుతోంది.

పాకిస్థాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమాండోలు… చొరబాట్లకు పెట్టింది పేరు. ఉగ్రవాదులతో కలిసి… భారత సైనికులను దొంగ దెబ్బ తీస్తుంటారు. అందుకే.. వారి కదలికలపై భారత ఆర్మీ ప్రత్యేకంగా నజర్ పెట్టింది. పాకిస్థాన్ ఆక్రమిత భూభాగంలోని సిర్ క్రిక్ ఏరియాలో కమాండోలు మాటువేసినట్టు సమాచారం సేకరించింది.

లీపా లోయలో… 12 ఆప్ఘన్ జిహాదీ గ్రూప్ లను జైష్ ఎ మహ్మద్ టెర్రర్ సంస్థ మోహరించినట్టు భారత ఇంటలిజెన్స్ కు సమాచారం అందింది. భారత బలగాలపై దాడుల కోసం.. పాకిస్థానీ ఉగ్రవాద సంస్థలు ఆప్ఘన్ టెర్రరిస్టులను రిక్రూట్ చేసుకుంటున్నట్టు ఇండియన్ ఆర్మీ దగ్గర సమాచారం ఉంది. దీంతో.. ఇండియన్ ఆర్మీ మరింత అలర్ట్ అయింది.