టీవీ పగలగొట్టిన పాక్ ఫ్యాన్.. తనదైన శైలిలో సెహ్వాగ్ సెటైర్

టీవీ పగలగొట్టిన పాక్ ఫ్యాన్.. తనదైన శైలిలో సెహ్వాగ్ సెటైర్

ఉత్కంఠభరితమైన మ్యాచ్. ఉద్వేగభరితమైన మ్యాచ్..హోరాహోరీ మ్యాచ్..ఆసక్తికరమైన మ్యాచ్..భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్కు ఏ క్యాప్షన్ పెట్టినా..సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే..దాయాదుల మధ్య పోరు మినీ యుద్దాన్ని తలపించింది. రెండు టీమ్స్ కాదు..రెండు దేశాలు కొట్లాడుకున్నంత పనైంది. మెల్ బోర్న్ వేదికగా..జరిగిన టీమిండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్..అనేక లో మలుపులు..ట్విస్టులు సంభవించాయి. చివరకు కోహ్లీ పోరాటంతో భారత్ విజయకేతనం ఎగురవేసింది. దీంతో భారత అభిమానుల సంతోషాలకు అవధుల్లేవు. టీమిండియాకు శుభకాంక్షలు చెబుతూ..భారత ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటే..ఓటమితో పాక్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.

చిరస్మరణీయ విజయం...
సూపర్-12లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాక్తో  చివరి వరకు ఉత్కంఠంగా సాగిన  మ్యాచులో భారత్ చిరస్మరణీయ విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాక్..20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఆ తర్వాత టార్గెట్ ఛేజింగ్ లో భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసి గెలుపొందింది. 160 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా కేవలం 31 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. ఈ సమయంలో  హార్దిక్ పాండ్యా  37 బంతుల్లో  40 పరుగులతో కలిసి కోహ్లీ జట్టును  మ్యాచ్‌లోకి తీసుకువచ్చాడు. భారత్ విజయానికి చివరి 3 ఓవర్లలో 48 పరుగులు కావాల్సి ఉండగా.. కోహ్లీ కమాల్ చేశాడు. ఇక చివరి ఓవర్ లో భారత్ విజయానికి 16 పరుగులు అవసరం అయ్యాయి. దీంతో పాక్, భారత్ అభిమానుల్లో ఉత్కంఠ పీక స్టేజ్ కు చేరింది. కోట్ల సంఖ్యలో అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. ప్రతీ బంతిని కళ్లార్పకుండా చూశారు.

నరాలు తెగే ఉత్కంఠ...
స్పిన్నర్ నవాజ్‌ వేసిన చివరి ఓవర్లో మొదటి బాల్కు హార్దిక్ పాండ్యా ఔటయ్యాడు. రెండో బంతికి ఒక్క పరుగే వచ్చింది. మూడో బంతికి విరాట్‌ రెండు పరుగులు చేశాడు. నాల్గో బంతికి కోహ్లీ సిక్స్‌గా మలిచాడు. దీంతో జట్టుకు ఏడు పరుగులు వచ్చాయి.  దీన్ని అంపైర్లు నోబాల్గా ప్రకటించారు. దీంతో విజయానికి 3  బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. ఫ్రీహిట్ను భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన కోహ్లీ బౌల్డ్‌ అయ్యాడు. కానీ ఫ్రీహిట్‌ కావడంతో బతికిపోయాడు. అయితే బంతి వికెట్లను తాకి వెనకాలకు వెళ్లింది. ఈ సమయంలో కోహ్లీ  కార్తీక్..మూడు పరుగులు తీశారు. 5వ బంతికి కార్తీక్  స్టంప్‌ ఔట్‌ అయ్యాడు. ఈ సమయంలో అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. చివరి బంతిని నవాజ్ వైడ్గా వేయడంతో సమీకరణం ఒక బంతికి ఒక్క పరుగుగా మారింది. చివరి బాల్ను అశ్వన్ ఆఫ్‌సైడ్‌ ఫీల్డర్ల మీదుగా బాదడంతో..టీమిండియా విజయం సాధించింది. 

టీవీని పగలగొట్టిన ఫ్యాన్..
టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని అందుకోవడంతో భారత అభిమానులు సంబరాలు చేసుకుంటే పాక్ ఫ్యాన్స్ మాత్రం నిరాశకు గురయ్యారు. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సెటైరికల్ వేలో స్పందించారు. ఇంట్లో మ్యాచ్ చూస్తున్న  ఓ అభిమాని, అహనంతో టీవీ పగులగొట్టిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశాడు. "రిలాక్స్ ఇది ఓన్లీ గేమ్.. మీరు చాలా ప్రయత్నించారు. దీపావళికి మేం పటాకులు కాలిస్తే మీరు మాత్రం టీవీలు పగలగొడుతున్నారు?  అసలు టీవీ చేసిన తప్పేంటి" అని సెహ్వాగ్ ఫన్నీగా కామెంట్ చేశాడు. సెహ్వాగ్ షేర్ చేసిన ట్వీట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. పలువురు మాజీ క్రికెటర్లు సైతం ఈ పోస్టుకు ఫన్నీ ఎమోజీలు జత చేశారు.