12 టెర్రర్​ గ్రూపులకు పాకిస్తానే అడ్డా

12 టెర్రర్​ గ్రూపులకు పాకిస్తానే అడ్డా
  • అమెరికా కాంగ్రెస్​ రిపోర్టులో వెల్లడి

వాషింగ్టన్: టెర్రరిస్టు గ్రూపులకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తోందని అమెరికా మరోసారి తేల్చి చెప్పింది. ఫారిన్ టెర్రరిస్టు ఆర్గనైజేషన్లుగా గుర్తించి న వాటిలో కనీసం 12 సంస్థలకు పాకిస్తాన్​ అడ్డాగా మారిందని వెల్లడించింది. ఆ గ్రూపులకు పాక్ ఒక బేస్ గా మారిందని, అక్కడి నుంచే ఆపరేషన్లు చేస్తున్నాయని తెలిపింది. ఈమేరకు ‘‘టెర్రరిస్టు అండ్ అదర్ మిలిటెంట్ గ్రూప్స్ ఇన్ పాకిస్తాన్” పేరుతో అమెరికా కాంగ్రెస్​కు చెందిన కాంగ్రెస్సియనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) రిపోర్టు రిలీజ్ చేసింది. పోయిన వారం జరిగిన క్వాడ్ సమ్మిట్ సందర్భంగా ఈ రిపోర్టును విడుదల చేసింది. ఈ టెర్రర్ గ్రూపులను మొత్తం 5 కేటగిరీలుగా విభజించింది. అవి గ్లోబల్లీ ఓరియెంటెడ్, అఫ్గానిస్తాన్ ఓరియెంటెడ్, ఇండియా అండ్ కాశ్మీర్ ఓరియెంటెడ్, డొమెస్టికల్లీ ఓరియెంటెడ్, సెక్టేరియన్. వీటిలో ఐదు టెర్రర్ గ్రూపులు మన దేశంలో దాడులకు పాల్పడుతున్నాయని పేర్కొంది. కాగా, యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ 2019 రిపోర్టులోని అంశాలనూ సీఎస్ఆర్ ఇందులో ప్రస్తావించింది. టెర్రరిజం కట్టడికి చర్యలు తీసుకుంటామన్న పాకిస్తాన్.. ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదని తెలిపింది.

ఇవీ టెర్రర్ గ్రూపులు.. 

లష్కరే తాయిబా, జైషే మహమ్మద్, హర్కతుల్ జిహాదీ ఇస్లామీ, హర్కతుల్ ముజాహిద్దీన్, హిజ్బుల్ ముజాహిద్దీన్, అల్ ఖైదా, అల్ ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్, ఐఎస్-కే, హక్కానీ నెట్ వర్క్, తెహ్రికీ తాలిబాన్ పాకిస్తాన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, జుందాల్లాహ్, సిఫే సహాబా పాకిస్తాన్, లష్కరే ఝాంగ్వీ.