పాకిస్తాన్ను వదలని భారీ వర్షాలు, వరదలు

పాకిస్తాన్ను వదలని భారీ వర్షాలు, వరదలు

భారీ వర్షాలు, వరదలు పాకిస్తాన్ ఆగమాగం చేస్తున్నాయి. కొద్ది రోజులుగా భారీ వర్షాలు పాక్ ను అతలాకుతలం చేస్తున్నాయి. ఎడ తెరిపి లేకుండా కురస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోతోంది. వరదలతో పాకిస్థాన్ లో దాదాపు 33 మిలియన్ల మంది నిరాశ్రయులైనట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 11వందల మంది చనిపోయారు. అలాగే సుమారు మూడు లక్షల ఇండ్లు దెబ్బతిన్నట్లు సమాచారం. కొన్ని చోట్ల రోడ్లు సైతం కొట్టుకుపోగా.. అనేక చోట్ల రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి.

ఇప్పటికే ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ భారీ వర్షాలు, వరదల దెబ్బకు కుదేలవుతోంది. తమకు సాయం చేసి ఆదుకోవాలంటూ  ఐక్యరాజ్యసమితిని, అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది. పాకిస్తాన్ లో నెలకొన్న పరిస్థితిని చూసి అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. మానవతా సాయం చేస్తామని ప్రకటించిన అమెరికా చెప్పినట్లే 30మిలియన్ డాలర్ల సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. వెంటనే పాక్ కు సహాయం అందించే ఏర్పాట్లు చేసింది.