
ఇస్లామాబాద్: చైనా యాప్ టిక్‌టాక్‌పై బ్యాన్‌ను ఎత్తివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. అసభ్యకరమైన కంటెంట్‌కు చోటివ్వబోమని, వెంటనే తొలగిస్తామని కంపెనీ హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అనైతిక, చట్టవిరుద్ధమైన కంటెంట్ ఉండటంతో పోయిన జులైలో పాక్ సర్కారు తమ దేశంలో ఈ చైనీస్ యాప్వాడకాన్ని బ్యాన్ చేసింది. స్థానిక చట్టాలు, సొసైటీ నియమాలకు వ్యతిరేకంగా ఉండే వీడియోలను కంట్రోల్ లో పెడతామని టిక్ టాక్ కంపెనీ హామీ ఇచ్చినందుకు బ్యాన్ ను ఎత్తివేస్తున్నామని పాక్ టెలీకమ్యూనికేషన్ అథారిటీ శనివారం ప్రకటించింది. అయితే, పాకిస్తాన్లో ఇలా టిక్‌టాక్‌ను బ్యాన్ చేయడం ఎత్తివేయడం ఇది నాలుగోసారి.