48 గంటల్లోనే పాక్కు షాక్.. ఐదో వన్డే కొంపముంచింది

 48 గంటల్లోనే పాక్కు  షాక్..  ఐదో వన్డే కొంపముంచింది

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్న  పాకిస్థాన్ 48 గంటల్లోపే ఆ  స్థానాన్ని కోల్పోయింది. ఐదు వన్డేల సిరీస్‌లో నాలుగో వన్డేలో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన పాక్... ఐదో వన్డేలో ఓడిపోవడంతో  నంబర్ వన్  ర్యాంకును కోల్పోయింది.  ఈ ఓటమితో పాకిస్థాన్ ఒక రేటింగ్ పాయింట్ కోల్పోయి 112 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. 

తాజా ర్యాంకింగ్ అప్‌డేట్‌లో ఆస్ట్రేలియా మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, భారత్ రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ 111 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో నిలవగా, పాకిస్థాన్ చేతిలో 4-1తో ఓడిన న్యూజిలాండ్ 108 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.న్యూజిలాండ్ కంటే ఏడు పాయింట్లు వెనుకబడి 101 పాయింట్లతో దక్షిణాఫ్రికా ఆరో స్థానంలో ఉంది. 

ఇక కరాచీ వేదికగా జరిగిన  మ్యాచ్ లో పాకిస్థాన్ 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో, టామ్ లాథమ్ నేతృత్వంలోని న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వైట్‌వాష్‌ను తప్పించుకుంది. . అయితే పాకిస్థాన్ 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్  జట్టు 49.3 ఓవర్లలో 299 పరుగులు చేసింది. 

 విల్ యంగ్ (87), కెప్టెన్ టామ్ లాథమ్ (59) హాఫ్ సెంచరీలతో న్యూజిలాండ్  కు భారీ స్కోర్ ను అందించారు.  300 పరుగులతో బరిలోకి దిగిన పాక్ ..  252 పరుగులు మాత్రమే చేసింది.  ఇఫ్తికర్ అహ్మద్ అజేయంగా చేసిన 94 పరుగులు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.