పెవిలియన్ చేరిన టీమిండియా ఓపెనర్లు

పెవిలియన్ చేరిన టీమిండియా ఓపెనర్లు

ఆసియా కప్ లో పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియాకు పాక్ బౌలర్లు షాక్ లు ఇస్తున్నారు. ఇద్దరు ఓపెనర్లు రాహుల్, రోహిత్ శర్మలను పెవిలియన్ కు పంపించారు. 6.3 ఓవర్లలో 66 పరుగులకే టీమిండియా జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. అప్పటి వరకు ఇరువురు ఓపెనర్లు ధాటిగా ఆడడంతో జట్టు భారీ స్కోరు సాధిస్తుందని అందరూ భావించారు. కానీ.. అలా జరగలేదు. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.

మంచి ఫామ్ లో కొనసాగుతున్న రోహిత్ శర్మ (28)ను పెవిలియన్ పంపించారు. అప్పటికీ జట్టు స్కోరు 54 పరుగులు. అనంతరం కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ఊపు మీదున్న రాహుల్ (28) కూడా వెనుదిరిగాడు. ప్రస్తుతం కోహ్లీ 5, సూర్యకుమార్ యాదవ్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. 7.6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి టీమిండియా 79 పరుగులు చేసింది.