మా దేశంతో ప్రపంచానికి ముప్పు

మా దేశంతో ప్రపంచానికి ముప్పు

యూఎన్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ఎదుట పాక్‌‌‌‌ మైనార్టీలు

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్‌‌‌‌ టెర్రరిస్టులకు పాకిస్తాన్‌‌‌‌ కేంద్రం అని ఆ దేశానికి చెందిన మైనార్టీలు ఆరోపించారు. యునైటెడ్‌‌‌‌ నేషన్స్‌‌‌‌ హ్యూమన్‌‌‌‌ రైట్స్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఎదుట బ్యానర్లు ఏర్పాటు చేశారు. పాకిస్తాన్‌‌‌‌ ప్రపంచానికి ముప్పు అని పాక్‌‌‌‌ మైనార్టీలు ఆరోపించారు. “ 9/11 నుంచి ఇంటర్నేషనల్‌‌‌‌ టెర్రరిస్టులకు పాకిస్తాన్‌‌‌‌ కేంద్రంగా మారిపోయింది. లోకల్‌‌‌‌, ఇంటర్నేషనల్‌‌‌‌ టెర్రరిస్టులకు అఫ్గానిస్తాన్‌‌‌‌ బోర్డర్‌‌‌‌ హబ్‌‌‌‌గా మారింది. అల్‌‌‌‌ఖైదా, తాలిబన్‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లు అన్నీ అక్కడే ఉన్నాయి” అని జెనీవాలోని ఒక ఎన్జీవో పేర్కొంది. టెర్రరిస్టులకు పాక్‌‌‌‌ ప్రభుత్వం సాయం‌‌‌‌ చేస్తోందని, ఆర్మీ కూడా సపోర్ట్‌‌‌‌ ఇస్తోందని మైనార్టీలు ఆరోపించారు. పాక్‌‌‌‌ ప్రభుత్వం చేస్తున్న ఇల్లీగల్‌‌‌‌ యాక్టివిటీస్‌‌‌‌ వల్ల దాన్ని కంట్రోల్‌‌‌‌ చేయలేకపోతోందని, యూఎన్‌‌‌‌ కలగజేసుకుని యాక్షన్‌‌‌‌ తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.

For More News..

ఢిల్లీ అల్లర్లు: 70 మంది ముస్లింలను రక్షించిన తండ్రీకొడుకులు

హైదరాబాద్‌లో సిలిండర్ల వరుస పేలుళ్లు

జవానుకు పెండ్లి కానుకగా కొత్త ఇల్లు

ఉద్యోగులకు త్వరలో మరో షాక్?