
తాలిబన్, ఇతర ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడానికి పాకిస్తాన్ స్వస్తి పలకాలన్నారు అమెరికా సెనేటర్ మాగీ హసన్. ఆఫ్ఘనిస్తాన్‌లో సుస్థిరత నెలకొల్పడంలో పాక్ ఎంతో ముఖ్యపాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాద నిరోధక కృషికి మరింతగా చేయూతనిస్తూ…ప్రపంచ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావడానికి కృషి చేయాలని తెలిపారు. పాకిస్తాన్‌లో పర్యటన ముగించుకున్న మాగీ హసన్ అక్కడినుంచి భారత్ పర్యటనకు వచ్చారు. ఇక్కడి నేతలతో ఆమె వివిధ అంశాలపై చర్చలు జరుపనున్నారు..