కులభూషణ్ అప్పీల్‌కు మరో చాన్స్

కులభూషణ్ అప్పీల్‌కు మరో చాన్స్

పాక్ జైల్లో ఉన్న ఇండియన్ నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ తన శిక్షపై అప్పీల్‌ చేసుకునేందుకు పాక్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. గూఢచర్యం ఆరోపణలతో మరణశిక్ష పడి కులభూషణ్ జాదవ్ గత నాలుగు సంవత్సరాలుగా పాక్ జైల్లోనే ఉంటున్నాడు. కాగా.. గురువారం పాక్ అసెంబ్లీ రివ్యూ, పున:పరిశీలన బిల్లు 2020కి ఆమోదం తెలిపింది. దాంతో కులభూషణ్ జాదవ్ తన శిక్షపై పాక్‌లోని ఏ హైకోర్టులో అయినా  అప్పీల్ చేసుకునే అవకాశం వచ్పింది. ఈ బిల్లును 21 మంది సభ్యులు కలిగిన కమిటీ ఆమోదించింది. ఈ బిల్లుకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని పేరు పెట్టారు. 

కాగా.. కులభూషణ్‌కు లభించిన అవకాశంపై భారత ప్రభుత్వం స్పందించింది. భారతీయ లాయర్లను అనుమతించడంతో పాటు.. సరైన న్యాయసహాయం అందించకపోతే పాక్ తీసుకున్న నిర్ణయానికి అర్థం ఉండదని కామెంట్ చేసింది. గూఢచర్యం ఆరోపణలతో జాదవ్‌ను బలూచిస్థాన్‌లో పాక్ అరెస్ట్ చేసింది. అనంతరం 2017లో జాదవ్‌కు పాక్ మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. అప్పటి నుంచి ఆయన పాక్ జైల్లోనే ఉన్నారు. అయితే పాక్ ఆరోపణలను భారత ప్రభుత్వం కొట్టిపారేసింది. జాదవ్‌ను ఇరాన్‌లోని చబాహర్ పోర్టులో అరెస్ట్ చేశారని భారత్ పేర్కొంది.