BCCI On SRH:  సన్‌రైజర్స్ లీడ్స్ జట్టులో పాక్ ప్లేయర్.. బీసీసీఐ రియాక్షన్ ఇదే!

BCCI On SRH:  సన్‌రైజర్స్ లీడ్స్ జట్టులో పాక్ ప్లేయర్.. బీసీసీఐ రియాక్షన్ ఇదే!

BCCI On SRH: ఇంగ్లాండ్ లో జరగనున్న ‘ది హండ్రెడ్’ లీగ్ వేలంలో భాగంగా పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు రూ.2.34 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీనిపై భారత్ లో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఓ భారతీయ ఫ్రాంచైజీ పాక్ ప్లేయర్‌ను కొనుగోలు చేయడంపై క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. వేలంలో సన్‌రైజర్స్ సీఈవో కావ్య మారన్, హెడ్ కోచ్ డానియల్ వెట్టోరి పాల్గొన్నారు. దీంతో ఐపీఎల్ 2026లో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడే మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. 

దీంతో ఎట్టకేలకు ఈ వివాదంపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా రియాక్ట్ అయ్యారు. ఇది ఐపీఎల్‌కు సంబంధించిన విషయం మాత్రం కాదు.. విదేశీ లీగ్‌లో జరిగిన వ్యవహారం.. అందువల్ల ఈ అంశంపై బీసీసీఐ జోక్యం చేసుకునే ఛాన్స్ లేదన్నారు. అది ఆ ఫ్రాంచైజీదే తుది నిర్ణయం అని స్పష్టం చేశారు. గతేడాది ఆపరేషన్ సింధూర్ సమయంలో అబ్రార్ ఇండియన్ ఆర్మీని విమర్శిస్తూ మైదానంలోనే రెచ్చిపోయాడు. అలాంటి సదరు పాక్ ప్లేయర్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడంపై పెద్దు ఎత్తున విమర్శలు కొనసాగుతున్నాయి.  

టీమిండియా వర్సెస్ -పాకిస్తాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలతో 2008 తర్వాత ఇప్పటి వరకు పాక్ కి చెందిన ఏ అంతర్జాతీయ ఆటగాడు కూడా ఐపీఎల్ టోర్నీలో ఆడలేదు. కానీ ప్రపంచంలోని ఇతర టీ20 లీగ్‌లలో మాత్రం ఐపీఎల్ యాజమాన్యంలోని జట్లు పాకిస్థాన్ ప్లేయర్స్ ని తీసుకున్న విషయం తెలిసిందే.