కరోనా పేరుతో పాక్‌ టెర్రరిస్టులకు స్వేచ్ఛ

కరోనా పేరుతో పాక్‌ టెర్రరిస్టులకు స్వేచ్ఛ
  • జైలు నుంచి టెర్రరిస్టులు రిలీజ్‌
  • హఫీజ్‌సయీద్‌ కూడా

ఇస్లామాబాద్‌: ప్రపంచ దేశాలను భయపెడుతున్న కరోనా మహమ్మారి పాకిస్తాన్‌ టెర్రరిస్టులకు మాత్రం వరంలా మారింది. ప్రపంచమంతా వైరస్‌కు వణికిపోతుంటే పాకిస్తాన్‌ మాత్రం వైరస్‌ కంటే డేంజర్ అయిన టెర్రరిస్టులను కాపాడుకోవాలని చూస్తోంది. జైల్‌లోని ఖైదీలకు కరోనా సోకుంతుందనే సాకుతో టెర్రరిస్టులను వదిలేసింది. ఇంటర్నేషనల్‌ టెర్రరిస్టులుగా ప్రకటించిన వాళ్లను కూడా జైలు నుంచి రిలీజ్‌ చేసింది. లాహోర్‌‌ జైలులో ఉన్న దాదాపు 50 మందికి ఖైదీలకు కరోనా సోకిందని పంజాబ్‌ ప్రావిన్స్‌ సీఎం గతవారం ట్వీట్‌ చేశారు. దీంతో ఇదే అదునుగా పాక్‌ తన వక్ర బుద్ధి చూపెట్టింది. ముంబై బ్లాస్ట్‌ కేసులో ప్రధాన నిందితుడు హఫీజ్‌ సయీద్‌ను కూడా జైలు నుంచి రిలీజ్‌ చేసింది. పాక్‌కు బ్లాక్‌ లిస్ట్‌ ముప్పు తప్పాలంటే టెర్రరిస్టులపై చర్యలు తీసుకోవాలని ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) హెచ్చరించింది. దీంతో ఆ ప్రభుత్వం చాలా మంది టెర్రరిస్టులను అరెస్టు చేసింది. పాక్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చాలా వద్దే అనే అంశంపై వచ్చే నెలలో సమీక్ష నిర్వహించనున్నారు.