వాస్తవాధీన రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలు

వాస్తవాధీన రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలు

దేశ సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ 18 ఉగ్రవాద శిబిరాలను తిరిగి ప్రారంభించిందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. సైన్యం అలర్ట్ గా ఉండాలంటూ ఉన్నతాధికారులు సూచించారు. 18 ఉగ్ర శిబిరాలు, 20 లాంచ్ ప్యాడ్ లు ప్రారంభమైనట్టు తెలుస్తోందని… ఒక్కో శిబిరంలో 60 మంది వరకూ టెర్రరిస్టులు ఉన్నారని తెలిపారు. కొద్ది రోజుల క్రితం పుల్వామాలో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజబుల్ ముజాహిద్దీన్ నేతలు సమావేశమై, ఉగ్ర శిబిరాల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకున్నారని ఇంటెలిజెన్స్ ఏజన్సీలు చెప్పాయి. కాశ్మీర్ లోయలో 300 మంది వరకూ టెర్రరిస్టులు ఉన్నారని జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ తెలిపిన 24 గంటలు గడవకుండానే ఈ హెచ్చరికలు వచ్చాయి.