క్రీడా సంక్షిప్త వార్తలు

క్రీడా సంక్షిప్త వార్తలు

పెర్త్‌‌: టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో పాకిస్తాన్‌‌ ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. వరుసగా రెండు ఓటముల తర్వాత చిన్న జట్టు నెదర్లాండ్స్‌‌పై గెలిచింది. ఆదివారం జరిగిన సూపర్‌‌12 గ్రూప్‌‌2 మ్యాచ్‌‌లో పాక్‌‌ బ్యాటింగ్‌‌లో మళ్లీ తడబడినప్పటికీ ఆరు వికెట్ల తేడాతో డచ్‌‌ టీమ్‌‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌‌ చేసిన నెదర్లాండ్స్‌‌ 20 ఓవర్లలో 91/9 స్కోరు చేసింది. కొలిన్‌‌ అకెర్‌‌మన్‌‌ (27), స్కాట్‌‌ ఎడ్వర్డ్స్‌‌ (15) తప్ప మిగతా బ్యాటర్లంతా సింగిల్‌‌ డిజిట్‌‌కే వెనుదిరిగారు. పాక్‌‌ బౌలర్లలో షాదాబ్‌‌ ఖాన్‌‌ (3/22), మొహమ్మద్‌‌ వసీం (2/15) సత్తా చాటారు. హారిస్‌‌ రవూఫ్‌‌ (1/10) బౌన్సర్‌‌ తగిలి తీవ్ర గాయంతో బాస్‌‌ డి లీడె (6) రిటైర్డ్‌‌ ఔట్‌‌ అయ్యాడు. కుడి కన్ను కింది భాగంలో కుట్లు పడ్డాయి.  అనంతరం పాక్‌‌ 13.5 ఓవర్లలో 95/4 స్కోరు చేసి గెలిచింది. కెప్టెన్‌‌ బాబర్‌‌ (4), షాన్‌‌ మసూద్‌‌ (12) ఫెయిలైనా  ఓపెనర్‌‌ రిజ్వాన్‌‌ (49), ఫఖర్ జమాన్‌‌ (20) జట్టును గెలిపించారు. షాదాబ్‌‌ ఖాన్‌‌కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది.

ఆధిక్యంలో హర్ష
న్యూఢిల్లీ: ఆసియా కాంటినెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ సెక్షన్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ హర్ష భరత్​కోటి ఆధిక్యంలో దూసుకెళ్తున్నాడు.  ఆదివారం జరిగిన ఐదో రౌండ్‌‌‌‌‌‌‌‌లో హర్ష  49 ఎత్తుల్లో ఇండియాకే చెందిన కౌస్తవ్‌‌‌‌‌‌‌‌ ఛటర్జీని ఓడించాడు. దాంతో, ఐదు గేమ్స్‌‌‌‌‌‌‌‌లో 4.5 పాయింట్లతో ఒక్కడే లీడ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. లియోన్‌‌‌‌‌‌‌‌ ల్యూక్‌‌‌‌‌‌‌‌తో గేమ్‌‌‌‌‌‌‌‌ను డ్రా చేసుకున్న ఆర్‌‌‌‌‌‌‌‌. ప్రజ్ఞానంద ఐదు పాయింట్లతో  ల్యూక్‌‌‌‌‌‌‌‌, మురళీ, సేతురామన్‌‌‌‌‌‌‌‌, అధిబన్‌‌‌‌‌‌‌‌, మక్సత్‌‌‌‌‌‌‌‌ (తుర్క్‌‌‌‌‌‌‌‌మెనిస్తాన్‌‌‌‌‌‌‌‌), వొఖిదోవ్‌‌‌‌‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌) కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ సెక్షన్‌‌‌‌‌‌‌‌లో ఏపీకి చెందిన ప్రియాంక, నందిదా ఐదు రౌండ్ల తర్వాత  4.5 పాయింట్లతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు.

బుల్స్‌‌‌‌, తలైవాస్‌‌కు విజయాలు
పుణె: ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌ తొమ్మిదో ఎడిషన్‌‌‌‌లో బెంగళూరు బుల్స్‌‌‌‌, తమిళ్‌‌‌‌ తలైవాస్‌‌‌‌ మరో విజయం సొంతం చేసుకున్నాయి. ఆదివారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో బెంగళూరు బుల్స్‌‌‌‌ 37–31 తేడాతో జైపూర్‌‌‌‌ పింక్‌‌‌‌ పాంథర్స్‌‌‌‌ను ఓడించింది. చివరి నిమిషా ల్లో ఇరు జట్లూ 30–30తో సమంగా నిలిచాయి. ఆఖర్లో వికాస్‌‌‌‌ కండోలా (8 పాయింట్లు)  సూపర్‌‌‌‌ రైడ్‌‌‌‌తో బుల్స్‌‌‌‌కు విజయం అందించాడు. మరో మ్యాచ్‌‌‌‌లో తలైవాస్‌‌‌‌ 49–39తో దబాంగ్‌‌‌‌ ఢిల్లీని చిత్తు చేసింది. తలైవాస్‌‌‌‌ టీమ్‌‌‌‌లో నరేందర్‌‌‌‌ ఏకంగా 24 పాయింట్లతో చెలరేగాడు.

శంకర్‌‌‌‌‌‌‌‌‌‌కు సిల్వర్​
సంటెండర్‌‌‌‌‌‌ (స్పెయిన్‌‌‌‌): ఇండియా యంగ్‌‌‌‌ షట్లర్‌‌‌‌ శంకర్‌‌‌‌ ముత్తుస్వామి.. బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ జూనియర్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌ సాధించాడు. ఆదివారం జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ఫైనల్లో శంకర్‌‌‌‌ 14–21, 20–22తో కువో కున్‌‌‌‌ లిన్‌‌‌‌ (చైనీస్‌‌‌‌తైపీ) చేతిలో ఓడి రెండో ప్లేస్‌‌‌‌తో సరిపెట్టుకున్నాడు. దీంతో ఈ టోర్నీలో రజతం నెగ్గిన నాలుగో షట్లర్‌‌‌‌గా రికార్డులకెక్కాడు. 