టీ20 వరల్డ్ కప్లో పాక్ బోణి

టీ20 వరల్డ్ కప్లో పాక్ బోణి

వరుసగా రెండు పరాజయాలు....ఇంటా బయట విమర్శలు..ఈ నేపథ్యంలో...టీ20 వరల్డ్ కప్ లో పాక్ ఎట్టకేలకు శుభారంభం చేసింది. నెదర్లాండ్స్ జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. పసికూనపై బుల్లెట్ బంతులతో విరుచుకుపడిన పాక్ బౌలర్లు...నెదర్లాండ్స్పై విజయంలో కీలక పాత్ర పోషించారు. 

నెదర్లాండ్స్ వణికింది...
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 91 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు బ్యాట్స్ మన్ లో కొలిన్ అకెర్మాన్ 27 బంతుల్లో 2 ఫోర్లతో 27 పరుగులు, స్కాట్ ఎడ్వార్డ్స్ 20 బంతుల్లో 15 పరుగులు చేశారు. మినహా వారు ఘోరంగా విఫలమయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో  షాదాబ్ ఖాన్3  వికెట్లు పడగొట్టగా...మహమ్మద్ వసీం 2 వికెట్లు తీశాడు. షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రౌఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. 

రాణించిన రిజ్వాన్...
92 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్..13.5 ఓవర్లలో 4 వికెట్ల మాత్రమే కోల్పోయి 95 పరుగులు సాధించింది. ఓపెనర్  మహమ్మద్ రిజ్వాన్ 39 బంతుల్లో 5 ఫోర్లతో 49 పరుగులు చేశాడు.  ఫకార్ జమాన్ 16 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులతో రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో గ్లోవర్ 2 వికెట్లు తీయగా...మీకరెన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.