మన ఫ్లైట్ ను కాపాడిన పాకిస్తాన్ ఏటీసీ

మన ఫ్లైట్ ను కాపాడిన పాకిస్తాన్ ఏటీసీ

ఇస్లామాబాద్: పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీకి చెందిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)  మన విమానాన్ని కాపాడాడు.   వాతావరణం అనుకూలంగా లేదని గురువారం   జైపూర్ నుంచి ఒమన్ రాజధాని మస్కట్ వెళ్తున్న ఫ్లయిట్‌‌‌‌‌‌‌‌  పైలెట్‌‌‌‌‌‌‌‌ గమనించాడు. వెంటనే ఆయన ఎలర్ట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో ఏటీసీ రియాక్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌  సౌత్‌‌‌‌‌‌‌‌ సింధ్ లోని  చోర్ ఏరియా దగ్గరకు రాగానే   ఒక్కసారిగా వాతావరణంలో అనూహ్యమైన  మార్పులు చోటుచేసుకున్నాయి.  ఆ సమయంలో విమానంలో 150 మంది ప్యాసింజర్లు ఉన్నట్టు  ది న్యూస్‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌  పేపర్‌‌‌‌‌‌‌‌ వెల్లడించింది. కరాచీ గగనతలం దాటుతుండగా ఆ విమానం  మెరుపు మధ్యలో చిక్కుకుని  వెంటనే 36 వేల అడుగుల ఎత్తు నుంచి 34 వేల అడుగుల ఎత్తులోకి జారిపోయింది. దీంతో  ఎలర్ట్‌‌‌‌‌‌‌‌ అయిన పైలట్ ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ద్వారా  దగ్గర్లోని స్టేషన్లకు ఎలర్ట్‌  మెసేజ్‌‌‌‌‌‌‌‌ పంపాడు.  పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ కంట్రోలర్‌‌‌‌‌‌‌‌  వెంటనే పైలెట్ రియాక్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. విమానాన్ని  దగ్గర్లోని  డెన్స్ ఎయిర్ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌లోకి మళ్లించాడు.  అలా ఫ్లయిట్‌‌‌‌‌‌‌‌ పాకిస్తాన్ గగన తలంలో క్షేమంగా ప్రయాణించింది.