బార్డర్‌‌‌‌ వద్ద పాక్‌‌ వ్యక్తి కాల్చివేత

బార్డర్‌‌‌‌ వద్ద పాక్‌‌ వ్యక్తి కాల్చివేత
  • ఇండియాలోకి అక్రమంగా ప్రవేశిస్తుండటంతో షూట్‌‌ చేసిన సెక్యూరిటీ సిబ్బంది

జమ్మూ: ఇండియాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న పాకిస్తాన్‌‌కు చెందిన వ్యక్తిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. పంజాబ్‌‌ ఫిరోజ్‌‌పూర్‌‌‌‌ సెక్టార్‌‌‌‌లో ఉన్న ఇంటర్నేషన్‌‌ బార్డర్‌‌‌‌ వద్ద ఈ ఘటన జరిగింది. గురువారం రాత్రి సరిహద్దు లోపలికి పాక్‌‌ వ్యక్తి ప్రవేశిస్తుండగా, భారత సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. అక్కడే ఆగిపోవాలని ఆ వ్యక్తిని హెచ్చరించినా.. వినిపించుకోకుండా దేశంలోకి ప్రవేశించడంతో షూట్‌‌ చేసి చంపేశారు.

కాగా, పాక్‌‌, భారత్‌‌ ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల వద్ద అనుమానాస్పదంగా ఎవరూ కనిపించినా షూట్‌‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం భద్రతా దళాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఇటీవల పాకిస్తాన్‌‌కు చెందిన మరో వ్యక్తిని పంజాబ్‌‌లోని గురుదాస్‌‌పూర్‌‌‌‌లో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి పాక్‌‌ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.