సోషల్‌‌‌‌ మీడియాలో బుక్కైన పాక్‌‌‌‌ సెనెటర్‌‌‌‌‌‌‌‌

సోషల్‌‌‌‌ మీడియాలో బుక్కైన పాక్‌‌‌‌ సెనెటర్‌‌‌‌‌‌‌‌
  • యూఎన్‌‌‌‌వోకు బదులు ‘యూనో’ గేమ్‌‌‌‌ ట్వీట్‌‌‌‌; ఆట ఆడుకున్న నెటిజన్లు

పాకిస్తాన్‌‌‌‌ సెనెటర్‌‌‌‌‌‌‌‌ రెహ్మాన్‌‌‌‌ మాలిక్‌‌‌‌ సోషల్‌‌‌‌ మీడియాలో బుక్కయ్యారు. కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో 370 రద్దు అంశంపై ప్రధాని నరేంద్ర మోడీని,  యునైటెడ్‌‌‌‌ నేషన్స్‌‌‌‌(యూఎన్‌‌‌‌వో)ను ట్యాగ్‌‌‌‌ చేయబోయి తప్పులో కాలేశారు. యూఎన్‌‌‌‌వోకు బదులుగా “ యూనో గేమ్‌‌‌‌” ను (ఇదో రకమైన కార్డ్స్‌‌‌‌ గేమ్‌‌‌‌) ట్యాగ్‌‌‌‌ చేశారు. జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో పర్యటించేందుకు ప్రతిపక్షాలను అనుమతించకపోవ డాన్ని తప్పుపడుతూ రెహ్మాన్‌‌‌‌ ట్వీట్‌‌‌‌ చేశారు. “ మోడీ జీ వాళ్లంతా మీ దేశ నేతలే. వాళ్లు చెప్పేది కూడా కాస్త వినండి” అని ట్వీట్‌‌‌‌ చేశారు.  రెహ్మాన్‌‌‌‌ చేసిన తప్పుకు నెటిజన్లు ఆయన్ను టార్గెట్‌‌‌‌ చేసి ఒక ఆట ఆడుకున్నారు. వచ్చి మోడీతో యూనో గేమ్‌‌‌‌ ఆడుకో అంటూ చురకలంటించారు. “ఈ ట్వీట్‌‌‌‌పై యూనో గేమ్‌‌‌‌ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలని ఉంది”  అని మరో నెటిజన్‌‌‌‌ ట్వీట్‌‌‌‌ చేశారు. సార్‌‌‌‌‌‌‌‌ నెక్స్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌ ‘పోక్‌‌‌‌మన్‌‌‌‌’ గేమ్‌‌‌‌ను ప్రశ్నించండి అంటూ జోకులు పేల్చారు.