నా హనీమూన్ సంగతి నీకెందుకు రా : టీవీ లైవ్ లో కొట్టిన సింగర్

నా హనీమూన్ సంగతి నీకెందుకు రా : టీవీ లైవ్ లో కొట్టిన సింగర్

లైవ్ టీవీ.. షో నడుస్తుంది.. చిట్ చాట్ సో.. సరదాగా సాగుతుంది.. ఇంతలో ఓ మహిళా గెస్ట్ కోపంతో ఊగిపోయింది.. ప్రశ్నించిన మరో హోస్ట్.. అతిధి చెంపలు వాయించింది.. అలా ఇలా కాదు.. ఐదు నిమిషాలు వెంట పడి మరీ కొట్టింది.. లైవ్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పాకిస్తాన్ దేశంలోని ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ లో ఎంటర్ టైన్ మెంట్ షో నడుస్తుంది. ఈ షోకు పాకిస్తాన్ సింగర్ షాజియా మంజూరు, కామెడీ యాక్టర్ షెర్రీ పాల్గొనగా యాంకర్ గా హైదర్ వ్యవహరిస్తున్నాడు. అప్పటి వరకు సరదాగా సాగిపోతున్న షోలో.. కామెడీ యాక్టర్ షెర్నీ.. సింగర్ షాజియాను ఉద్దేశిస్తూ.. ప్రాంక్ చేశాడు. షాజియా నువ్వు, నేనూ పెళ్లి చేసుకుని హనీమూన్ కు వెళ్లాలనుకుంటే ఏ విధంగా వెళితే బాగుంటుంది అంటూ ప్రాంక్ చేశాడు. ఊహించని కామెంట్స్, వ్యాఖ్యలతో సింగర్ షాజియా చిర్రెత్తుకుపోయింది.

ALSO READ :- ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. రోహిత్‌ను దాటేసిన జైశ్వాల్

 ప్రాంక్ అయితే మాత్రం ఇంత వల్గర్ గా ఉండాలా.. నోటికి అద్దూ అదుపు ఉండొద్దు.. ప్రాంక్ అయితే మాత్రం విలువలు ఉండవా.. మహిళలను ఏది పడితే అది అడుగుతారా అంటూ పక్కనే ఉన్న ప్రాంక్ అంటూ కామెంట్స్ కామెడీ యాక్టర్ షెర్నీకి కొట్టింది. చెంపలపై రెండు వాయించింది. 

లైవ్ షోలో సింగర్ షాజియా.. మరో అతిధిని అలా కొడుతుంటే మిగతా వాళ్లు జోక్యం చేసుకోవటానికి భయపడ్డారు. రెండు నిమిషాల తర్వాత యాంకర్ హైదర్ కలగజేసుకని సర్దిచెప్పాడు. ప్రాంక్ స్క్రిప్ట్ అయినా ఓ లిమిట్ ఉండాలని.. హద్దులు ఉంటాయంటూ కామెడీ యాక్టర్ పై అసహనం వ్యక్తం చేశాడు. షాజియా కోపం ఎంతకీ తగ్గకపోవటంతోపాటు షెర్నీపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో.. స్టూడియో నుంచి బయటకు పంపించేశారు. 

ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది.