టిక్ టాక్ వీడియో కోసం అడవికి నిప్పు పెట్టిన పాక్ యువతి

టిక్ టాక్  వీడియో కోసం అడవికి నిప్పు పెట్టిన పాక్ యువతి
  • టిక్ టాక్  వీడియో కోసం అడవికి నిప్పు పెట్టిన పాక్ యువతి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • కాలుతున్న నిప్పు సెగల మధ్యలో నుంచి నడుస్తూ వీడియోకు ఫోజ్ 
  • నేను ఎక్కడ ఉన్నా.. అక్కడ మంటలు చెలరేగుతాయంటూ పోస్ట్
  • వినాశనానికి కారకురాలంటూ యువతిపై నెటిజన్ల విమర్శలు

లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న ఓ పాకిస్థానీ సోషల్ మీడియా స్టా్ర్ కేవలం పదిహేను సెకన్ల టిక్ టాక్ వీడియో కోసం ఏకంగా అడవినే తగలబెట్టింది. అంతే కాదు అంతటి వినాశకమైన పని చేసి, ఆ వేడి సెగల్లోనుంచి నడుస్తూ వీడియోకు పోజులివ్వడం పలు విమర్శలకు తావిస్తోంది. హుమైరా అస్గర్ అనే యువతి సిల్వర్ బాల్ గౌనులో కాలుతున్న అడవి కొండల నడుమ సరదాగా నడుస్తున్న క్లిప్‌ను పోస్ట్ చేయడమే కాక, "నేను ఎక్కడ ఉన్నా ..అక్కడ మంటలు చెలరేగుతాయి" అనే ట్యాగ్ ను జత చేసింది. జస్ట్ బ్యాగ్రౌండ్ లో ఎఫెక్ట్ కోసం ఉద్దేశపూర్వకంగా అడవికి నిప్పు పెట్టినందుకుగానూ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.