
జైషే టెర్రరిస్టు ఉమర్‌కు గతేడాది
పాక్ నుంచి రూ.10 లక్షలు
రూ.5.7 లక్షలతో వ్యాన్,
పేలుడు పదార్థా లు కొనుగోలు
చార్జిషీట్ దాఖలు చేసిన ఎన్‌ఐఏ
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన టెర్రర్ ఎటాక్ ప్లానింగ్ కోసం టెర్రరిస్టులు రూ.5.7 లక్షలు ఖర్చు చేసినట్లు తాజాగా వెల్లడైంది. ఈ మేరకు టెర్రరిస్టులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) చార్జ్ షీట్ దాఖలు చేసింది. జైషే మహమ్మద్ సంస్థ, పుల్వామా ఎటాక్ మాస్టర్ మైండ్ మహమ్మద్ ఉమర్ ఫరూఖ్ ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలను అందులో పేర్కొంది. గతేడాది జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య పాకిస్తాన్ నుంచి రూ.10 లక్షలు.. ఐదు ఇన్ స్టాల్ మెంట్లలో వచ్చినట్లు వివరించింది. ఉమర్ ఫరూఖ్ కు చెందిన అల్లయిడ్ బ్యాంక్, మీజాన్ బ్యాంక్ అకౌంట్లలో ఆ డబ్బు డిపాజిట్ అయినట్లు చెప్పింది.‘‘తన అకౌంట్లలోకి డబ్బు పంపాలని రావూఫ్ అస్గర్ అల్వి, అమ్మర్ అల్విలను ఉమర్ ఫరూఖ్ కోరాడు. ఈ డబ్బును జమ్మూకాశ్మీర్ లో ఎలా ఉపయోగించారో తెలుసుకుంటున్నాం’’ అని ఓ సీనియర్ ఎన్ఐఏ ఆఫీసర్ చెప్పారు. ఎవరికీ తెలియకుండా ఉండేందుకు హవాలా మార్గంలో డబ్బు ఎక్స్ చేంజ్ జరిగినట్లుగా ఇన్వెస్టిగేటర్లు అనుమానిస్తున్నారు.
ఇట్లా చొరబడ్డా రు..
నిందితుల్లో ఒకడైన ఇక్బాల్ రాథర్.. జమ్మూలోని సాంబా సెక్టార్ నుంచి కాశ్మీర్ కు నాలుగైదు బ్యాచ్ ల టెర్రరిస్టులను తరలించాడు. ప్రతి బ్యాచ్ లో ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నారు. సాంబా సెక్టార్ దగ్గర్లోని కాళీ బీన్ నది నుంచి దేశంలోకి చొరబడిన టెర్రరిస్టులను అతడు కాశ్మీర్ కు తీసుకెళ్లాడు. 2018 ఏప్రిల్ 14న ఉమర్ ఫరూఖ్ ఇండియాలోకి ఎంటర్ అయినట్లు ఎన్ఐఏ వద్ద ఉన్న టెక్నికల్ డేటా ద్వారా తెలుస్తోంది. బార్డర్ క్రాస్ చేస్తున్న సమయంలో ఉమర్, ఇక్బాల్ కలిశారు. తర్వాత ఉమర్ ను కాశ్మీర్ లోయలోని అషాఖ్ నీంగ్రో ఇంటికి ఇక్బాల్ తీసుకెళ్లాడు. అక్కడ కొన్నాళ్లు ఉండి.. తర్వాత పలు లొకేషన్లకు ఉమర్ మారాడు. ఉమర్ కు ఆశ్రయం ఇచ్చిన నీంగ్రో.. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. పుల్వామా ఎటాక్ తర్వాత మరో దాడి చేయాలని ఉమర్ ఫరూఖ్ ప్రయత్నించాడు. కానీ పాకిస్తాన్ లోని బాలాకోట్ లో జైషే క్యాం పుపై మనం ఎయిర్ స్ట్రైక్ చేయడంతో.. సైలెంట్ అయ్యాడు.
ఇలా ఖర్చు చేశారు..
జైషే టెర్రరిస్టులు మారుతీ ఎకో వ్యాన్ కొనేందుకు రూ.1.85 లక్షలు ఖర్చు చేశారు. భారీ పేలుడు పదార్థాలు తీసుకెళ్లేందుకు వీలుగా రూ.35 వేలు పెట్టి వ్యాన్ కు రిపేర్లు చేయించారు. రెండు ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ (ఐఈడీ)లను తయారు చేసేందుకు అవసరమైన పేలుడు పదార్థాలను రూ.2.25 లక్షలు ఖర్చు పెట్టి కొన్నారు. రూ.35 వేలతో అల్యూమినియంను ఆన్ లైన్ లో కొన్నారు. 4 కేజీల అల్యూమినియం.. శ్రీనగర్ లోని ఓ ఇంటికి డోర్ డెలివరీ జరిగింది. ఇందుకు సంబంధించి వాయిజ్ ఉల్
ఇస్లామ్ అనే వ్యక్తిని ఇప్పటికే అరెస్టు చేశారు.