
లాహోర్: పాకిస్తాన్ చానల్‌లో పనిచేస్తున్న ఇద్దరు జర్నలిస్టులు జమ్మూకాశ్మీర్ ఇండియాలో భాగం అని చూపించినందుకు వారిని ఉద్యోగాల్లో నుంచి తొలగించారు. పాకిస్తాన్ ప్రభుత్వం నడుపుతున్న పీటీవీ న్యూస్ చానల్‌లో పనిచేస్తున్న ఇద్దరు జర్నలిస్టులు కాశ్మీర్ ఇండియాలో భాగం అని ఉన్న మ్యాప్‌ను ఎయిర్ చేశారు. దీంతో వారిద్దరిపై యాక్షన్ తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నెల 6న మ్యాప్ ఎయిర్ అయిందని, 8న పార్లమెంట్‌లో ఈ విషయాన్ని స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి పాస్ చేయడంతో వారు ఈ చర్యలు తీసుకున్నారు. “ తప్పుడు మ్యాప్‌ను ఎయిర్ చేశారనే విషయంపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలనే ఆదేశాలు వచ్చాయి. వారిపై ఎంక్వైరీ చేసి ఉద్యోగాల నుంచి తొలగించాం” అని పీవీటీ మేనేజ్‌మెంట్ ట్వీట్ చేసింది.