చహర్ ను చూసి పాక్ బ్యాట్స్ మెన్ నేర్చుకోవాలె

చహర్ ను చూసి పాక్ బ్యాట్స్ మెన్ నేర్చుకోవాలె

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో క్రికెట్ వర్గాల్లో టీమిండియా పేసర్ దీపక్ చహర్ పేరు మార్మోగుతోంది. ఓటమి పాలవుతుందనుకున్న మ్యాచ్ లో చహర్ భారత్ ను గట్టెంకించిన తీరుకు మన దేశ క్రికెటర్లతో పాటు ఇతర దేశాల సీనియర్ ఆటగాళ్లు కూడా ఫిదా అయ్యారు. పాక్ వెటరన్లు వసీం అక్రమ్, డానిష్ కనేరియా చహర్ ను ప్రశంసల్లో ముంచెత్తారు. చహర్ బ్యాటింగ్ నుంచి పాక్ క్రికెటర్లు చాలా నేర్చుకోవాలని కనేరియా అన్నాడు.

'చహర్, భువనేశ్వర్ కు థ్యాంక్స్ చెప్పాలి. వారి ప్రతిభతో భారత్ నెగ్గింది. మూడో వన్డేలో తుది జట్టులో మార్పులు చేసుకోవడానికి టీమిండియాకు అవకాశం దక్కింది. మొత్తం క్రెడిట్ చహర్ కే ఇవ్వాలి. అతడి నుంచి పాకిస్తాన్ బ్యాట్స్ మెన్  నేర్చుకోవాల్సి ఉంది. క్రీజులో నిలదొక్కుకుని చెత్త బంతులనే బౌండరీలకు పంపాడు. ఇది చహర్ రోజుగా చెప్పొచ్చు. అతడు మూడు వికెట్లను తీయడంతోపాటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటాడు. అనవసర షాట్లు ఆడకుండా, మ్యాచ్ ను ఆఖరి ఓవర్ కు తీసుకెళ్లడం ధోనీ వ్యూహాన్ని గుర్తు చేసింది' అని కనేరియా పేర్కొన్నాడు.