పలాస ఫేమ్ రక్షిత్.. నరకాసుర మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

పలాస ఫేమ్ రక్షిత్.. నరకాసుర మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

నరకాసుర మూవీ రివ్యూ:

పలాస మూవీతో మంచి హిట్ అందుకుని..తెలుగు ఆడియాన్స్ కు చేరువైన హీరో రక్షిత్ (Rakshith) అట్లూరి లేటెస్ట్ మూవీ నరకాసుర (Narakasura). పలాస తరహాలోనే రా అండ్ రస్టిక్ సినిమాతో రక్షిత్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఇవాళ నవంబర్3న థియేటర్లలో రిలీజ్ అయింది. మరి కథేంటి? ఎవరెలా చేశారో..తెలుసుకుందాం.

నరకాసుర కథేటంటే..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాకు చెందిన హీరో శివ (రక్షిత్‌ అట్లూరి) –తమిళనాడు సరిహద్దులో ఉండే ఓ కాఫీ, మిరియాల పంటల  ఎస్టెట్‌లో లారీ డ్రైవర్‌ గా..నమ్మకమైన బంటుగా అక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు. అలా ఆ ఎస్టేట్ మొత్తానికి అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. ఆ ఎస్టేట్ యాజమాని ఒక లోకల్ ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే నాగమ నాయుడు (చరణ్‌ రాజ్‌) అంటే శివకి చచ్చేంత ప్రాణం. ఎమ్మెల్యే కు ఎవరైనా అడ్డొస్తే చంపేంత ప్రాణం కూడా. ఉన్నట్టుండి శివ మిస్ అవుతాడు. దీంతో తప్పిపోయిన హీరో శివ కోసం పోలీసులు వెతకడం స్టార్ట్ చేస్తారు. అసలు శివ ఎలా మిస్ అయ్యాడు?  అతను అదృశ్యం కావడానికి కారణాలు ఏంటనే కోణంలో దర్శకుడు సెబాస్టియన్ చాలా చక్కగా కథనం రాసుకున్నాడు.  

ఎమ్మెల్యే నాయుడు కొడుకు ఆది నాయుడు (తేజ చరణ్‌ రాజ్‌) తో శివకు అనుకోకుండా గొడవ మొదలవుతుంది.? శివను ప్రేమించిన అతనిని మరదలు వీరమణి (సంకీర్తన విపిన్), తను ప్రేమించి పెళ్లి చేసుకున్న మీనాక్షి(అపర్ణ జనార్దన్‌) కోసం శివ ఏం చేశాడనేది మూల కథగా డైరెక్టర్ రాసుకున్నాడు. అసలు ఊరికి మంచి చేసే వ్యక్తిగా ఉన్న శివకి..ఆది నాయుడుకు మధ్య గొడవ జరగడం..ఇవన్నీ సస్పెన్స్ గా సాగుతుంటాయి. అందులోను ‘నరకాసుర’ అనే టైటిల్ కి శివకి లింక్ చేస్తూ..ట్రాన్స్ జెండర్స్ పరిపాలించే రాజ్యంలో వెళ్లడం.. నరకాసుర వధ కథలో అర్ధ నారీశ్వరులు పోషించిన పాత్రేంటి? అనేది తెలియాలంటే నరకాసుర ను ఖచ్చితంగా థియేటర్లో చూస్తేనే..కిక్ వస్తోంది. 

కథ విశ్లేషణ:

ఈ సినిమా కథ మరి కొత్త కథ అని చెప్పలేము. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో తెలుగులో చాలా కథలు వచ్చాయి. ఏ సినిమాలో అయిన ఊరికోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉండే హీరోస్ లానే.. ఈ సినిమాలో శివ అనే ఒక యువకుడు తనకు దేవుడనుకున్న నాయుడు చేతిలోనే మోసానికి గురై..అతని కొడుకుని చంపడానికి..దారిన తీసిన అంశాలతో కథ సాగడం ఫస్టాఫ్ సాగగా..ఆ ఆదినాయుడ్ని చంపడానికి హీరో శివ చేసే అనేక ప్రయత్నాలు..అతన్ని ఎలా అంతమొందించడానికి హెల్ప్ అయ్యాయి అనేదే ఈ నరకాసుర కథ. 

కానీ నరకాసుర  కథలో ప్రధాన బలం అంటే..శివ తప్పిపోయి..ట్రాన్స్ జెండర్స్ ఉండే ప్రాంతంలోకి వెళ్లడం..ఆ అర్ధ నారీశ్వరులతో కలిసి హీరో శివు చేసిన తాండవమే గూస్బంప్స్ తెప్పిస్తుంది. కానీ నరకాసుర సినిమా మొత్తం..చాలా వరకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేలా..నాన్ లీనియర్ ఎడిటింగ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఈ కథలో..హీరో  శివ భార్యను చెరబట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తిని హిజ్రాల సాయంతో అంతమొందించే ప్రాసెస్ అంతవరకు బాగానే ఉన్నా..కథనం నడపడంలో డైరెక్టర్ మరెన్నో కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేశారు. అందులోను ఒకానొక దశలో అనుకోకుండా హిజ్రాలను శివ అవమానించడం..ఇలా కొన్ని అంశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. 

 

టెక్నిషియన్స్.. 

ఈ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ తన పాత్రకు న్యాయం చేశాడు. పలాస మూవీతో తన నటనతో మంచి మార్కులు తెచ్చుకోగా..ఈ మూవీతో పర్వాలేదనిపించారు. అపర్ణ జనార్దన్, నాజర్  కీలక పాత్రల్లో నటించారు. ఎమ్మెల్యేగా చరణ్ రాజ్, ఆయన కుమారుడిగా తేజ్ చరణ్ రాజ్ కరెక్ట్ గా వారి నెగిటివ్ క్యారెక్టర్ కు కరెక్ట్ గా సెట్ అయ్యారు.

దర్శకుడు సెబాస్టియన్ చాలా రసవత్తరంగా సినిమాను సోషల్ మెసేజ్ తో తీర్చిదిద్దారు. సెన్సిటివ్ సబ్జెక్ట్‌లను డెప్త్‌గా, సెన్సిటివిటీతో చిత్రీకరించడంలో దర్శకుడి సామర్థ్యానికి ఈ సినిమా నిదర్శనంగా నిలుస్తోందని చెప్పడంలో సందేహం లేదు.

అలాగే సినిమాటోగ్రాఫర్ నాని చామిడి శెట్టి  కాఫీ, పెప్పర్ ఎస్టేట్ యొక్క సెట్టింగ్ కూడా చాలా అందంగా  చూపించారు. ఇక వంశీ కృష్ణ ఎడిటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకుని ఉండాల్సింది. నౌపాల్ రాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. 

ALSO READ :- తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త... ఆ టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం ఇదే!