కాంగ్రెస్​దే అధికారమని బీఆర్ఎస్ కు తెలుసు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కాంగ్రెస్​దే అధికారమని బీఆర్ఎస్ కు తెలుసు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • కేసీఆర్, కేటీఆర్ ఫ్రస్ట్రేషన్​లో మాట్లాడుతున్రు
     
  • పాలేరు కాంగ్రెస్​ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం, వెలుగు : కాంగ్రెస్​దే అధికారమని బీఆర్ఎస్ కు తెలుసుకాంగ్రెస్​ కు ప్రజల అండ ఉందని, బీఆర్ఎస్​ కు డబ్బు అండ ఉందని చెప్పారు. ఎవరు డబ్బును నమ్ముకొని రాజకీయం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. రాష్ట్రంలో 72 నుంచి 78 సీట్లతో కాంగ్రెస్​ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 17న పినపాక నియోజకవర్గంలోని మణుగూరులో నిర్వహించే రాహుల్ గాంధీ బహిరంగ సభ ను సక్స స్​ చేయాలని కోరారు. ఆయన వెంట మువ్వా విజయ్​ బాబు, సాదు రమేశ్​ రెడ్డి, ముదిరెడ్డి నిరంజన్​ రెడ్డి ఉన్నారు. 

గొర్రెలు ఇవ్వకుండా మోసం చేసిన్రు.. 

కూసుమంచి, వెలుగు :  ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అప్పులు తెచ్చి డీడీలు కట్టిన యాదవులకు బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఇంతవరకు గొర్రెలు పంపిణీ చేయలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తరువాత చేపట్టబోయే పనులను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నాయకులు రాంరెడ్డి, చరణ్​రెడ్డి, రాయల నాగేశ్వరరావు, స్వర్ణకుమారి, గురవయ్య పాల్గొన్నారు.

సమన్వయంతో పని చేయాలి

కల్లూరు, వెలుగు :  సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మట్టా రాగమయిని గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని పొంగులేటి స్వగ్రామం నారాయణపురంలో తన తండ్రి దివంగత రాఘవరెడ్డి స్మృతి వనం వద్ద మామిడి తోటలో మట్టరాగమయితోపాటు నియోజకవర్గంలోని ఐదు మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. సమావేశంలో పార్టీ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్, డీసీసీబీ మాజీ చైర్మన్ మొవ్వ విజయబాబు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ లో చేరిక

ఖమ్మం రూరల్, వెలుగు : మండలంలోని తనగంపాడుకు చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ కార్యదర్శి తిరుమల కొండ నాగరాజు, గ్రామీణ వైద్యుడు తొట్ల విజయ్ బుధవారం పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు కళ్లెం వెంకటరెడ్డి, తనగంపాడు సర్పంచ్ కేతినేని వేణు ఆధ్వర్యంలో సాయి గణేశ్​ నగర్ లోని పార్టీ క్యాంప్ కార్యాలయంలో పొంగులేటి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.