కేసీఆర్​కు ముస్లింలపై చిత్తశుద్ధి లేదు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కేసీఆర్​కు ముస్లింలపై చిత్తశుద్ధి లేదు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నేలకొండపల్లి, వెలుగు  : ‘కాంగ్రెస్ అంటే ముస్లింలు.. ముస్లింలు అంటే కాంగ్రెస్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించినది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ ఇప్పుడు కేసీఆర్ కు ముస్లింలపై చిత్త శుద్ధి లేదు’ అని పాలేరు కాంగ్రెస్​ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాననని కేసీఆర్​ చేతులు దులుపుకున్నారన్నారు.  కేసీఆర్ కు వ్యక్తి గతంగా కేంద్రం నుంచి రావాల్సిన సహకారాలు, జీవోలు రాకపోతే కోర్టుకు పోయి వాటిని క్లియర్ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని, మరి ముస్లిం రిజర్వేషన్లపై ఎందుకు కోర్టుకు పోలేదని ప్రశ్నించారు. గ్రామీణ వైద్యులకు తగిన గుర్తింపు కల్పించినది వైఎస్ఆర్ అని గుర్తు చేశారు.

ప్రతీ పంచాయతీలో కబరస్తాన్ కు ప్రహారీలు వీలైతే ప్రభుత్వం ద్వారా.. లేకుంటే తన సొంత ఖర్చులతో నిర్మిస్తానని హామీ ఇచ్చారు. మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు బాజామియా, టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు, ధరవాత్ రామూర్తి నాయక్, హుస్సేన్, ముస్తాపా, సుభాన్, నాయకులు బచ్చలకూరి పాల్గొన్నారు.  

 నీళ్లను ఇంజక్షన్లుగా అమ్మిన డబ్బుతో రాజకీయాలు

పెనుబల్లి, వెలుగు :  కరోనా సమయంలో నీళ్లను వ్యాక్సీన్లుగా చూపించి ఇంజెక్షన్లుగా వేసి వేల కోట్లు సంపాదించిన పెద్దమనిషి రాజకీయాలను శాసించాలని చూస్తున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలోనిర్వహించిన కాంగ్రెస్ సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మలతో కలిసి ఆయన మాట్లాడారు. అధికారపార్టీ అభ్యర్థికి వత్తాసుపలుకుతున్న వ్యక్తులు సత్తుపల్లిలో ఎన్ని వందల కోట్లు ఖర్చుపెట్టినా ఉత్తదేనన్నారు.

మట్టారాగమయిని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని పిలుపునిచ్చారు. డీసీసీబీ మాజీ చైర్మన్​ విజయబాబు, మాజీ ఆత్మ చైర్మన్ ​ రామక్రిష్ణ, జిల్లా నాయకులు మట్టా దయానంద్, వెంకటేశ్వరావు, రామారావు పాల్గొన్నారు.

వాళ్ల పప్పులు ఉడకనివ్వం  

దమ్మపేట, వెలుగు :  అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతూ డబ్బు మదంతో అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న జిల్లాలోని కొందరు పారిశ్రామిక వేత్తల పప్పులు ఉడకనివ్వబోమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి  అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కొందరు కండు వాలు మార్చి ప్రజాక్షే త్రంలోకి వస్తున్నారని, వారి మాయ మాటలు నమ్మొద్దని సూచించారు. అధికార మదంతో విర్రవీగే వారికి ఓటు ద్వారా సమాధానం చెప్పాలని కో రారు. అశ్వరావుపేటలో జారే ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.