
కూసుమంచి, వెలుగు: పాలేరు ఎడమ కాలువ యూటీ(అండర్‌టన్నెల్) పనులు వేగంగా జరుగుతున్నాయ. రూ.14 కోట్లతో చేపడుతున్న ఈ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. దీంతో కాంట్రాక్టర్రెండు షిఫ్టుల్లో పనులు చేయిస్తున్నారు. ఐబీ ఎస్ఈ వెంకటశ్వర్లు, డీఈ మాధవి మంగళవారం పరిశీలించారు. నాణ్యతతో నిర్మాణం చేపట్టాలని సూచించారు.