కాంగ్రెస్సోళ్లు రెచ్చగొట్టినా సంయమనం పాటించాలి : పల్లా రాజేశ్వర్​రెడ్డి

కాంగ్రెస్సోళ్లు రెచ్చగొట్టినా సంయమనం పాటించాలి : పల్లా రాజేశ్వర్​రెడ్డి

చేర్యాల, వెలుగు: కాంగ్రెస్సోళ్లు రెచ్చిపోయి మాట్లాడినా బీఆర్‌‌ఎస్​నేతలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి కోరారు. సోమవారం ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటిసారి చేర్యాలకు రావడంతో నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. తన గెలుపు కోసం అహర్నిషలు కష్టపడి పనిచేసిన ప్రతి బీఆర్​ఎస్​ కార్యకర్తకు అండగా ఉంటానన్నారు.

అందరం సమిష్టిగా పనిచేసి జనగామ నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముందుండి పనిచేస్తానన్నారు. చేర్యాల రెవెన్యూ డివిజన్​ఏర్పాటుకు కృషి చేయడంలో వెనుకంజ వేసేదిలేదన్నారు. కార్యక్రమంలో నాగేశ్వర్​రావు, మల్లేశం, కర్నాకర్​, స్వరూపరాణి, రాజీవ్​రెడ్డి, మల్లేశం గౌడ్​, నరేందర్​, కనకమ్మ, సతీశ్, వెంకట్​రెడ్డి, కొండయ్య, ఉపేందర్​ గుప్తా, సదానందం పాల్గొన్నారు. 

మల్లన్నను దర్శించుకున్న పల్లా 

కొమురవెల్లి: కొమురవెల్లి మల్లికార్జునస్వామిని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం ఆలయానికి వచ్చిన పల్లాకు ఆలయ ఈఓ బాలాజీ, అర్చకులు, ఒగ్గుపూజరులు ఘనస్వాగతం పలికారు.

అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కొమురవెల్లి మల్లన్న కల్యాణం, బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై త్వరలోనే సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ లత, ఉపసర్పంచ్ శ్రీధర్, ఎంపీపీ కీర్తన, జడ్పీటీసీ సిద్ధప్పపాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ

జగదేవ్​పూర్​ మండలంలోని మునిగడప వద్ద రెండు ఆటోలు ఢీకొన్న  ప్రమాదంలో కొమురవెల్లి మండలంలోని గురున్నపేట గ్రామానికి చెందిన నలుగురు కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో పుట్ట జయమ్మ, వైనాల శిరీష అక్కడికక్కడే మృతిచెందగా గుర్రాల లక్ష్మి, దాసరపు మల్లవ్వ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు.