ఈటల రాజేందర్ రూట్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి

V6 Velugu Posted on Jun 17, 2021

  • హుజురాబాద్‌లో ఎమ్మెల్సీ పల్లా పర్యటన
  • అదే రూట్లో ఈటల పర్యటన
  • పల్లాను చూసి జై బీజేపీ, జై ఈటల నినాదాలు

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హుజురాబాద్‌లో పర్యటిస్తున్నారు. కాగా.. ఈటల వచ్చే రూట్లోనే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా వస్తుండటంతో... పల్లాను చూసిన ఈటల అభిమానులు హడావుడి చేశారు. జై ఈటల, జై బీజేపీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్  సొంత నియోజకవర్గం హుజురాబాద్‌లో పర్యటిస్తున్నారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉండనున్నారు. హుజురాబాద్ వెళ్తున్న ఈటలకు మార్గమధ్యంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. హుజురాబాద్‌లో అమరవీరుల స్థూపానికి ఈటల నివాళులు అర్పించారు. ఈటల వెంట ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, బీజేపీ నేతలు స్వామిగౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి ఉన్నారు.

 

Tagged Bjp, TRS, Telangana, Palla Rajeshwar Reddy, Eatala Rajender, Huzurabad, Eatala huzurabad tour, palla rajeshwar reddy huzurabad tour, ఈటల రూట్లో పల్లా

Latest Videos

Subscribe Now

More News