పల్లాడియం కార్బన్ దొంగల ముఠా అరెస్ట్ : ఎస్పీ పరితోశ్ పంకజ్

పల్లాడియం కార్బన్ దొంగల ముఠా అరెస్ట్ : ఎస్పీ పరితోశ్ పంకజ్
  • రూ.1. 52 కోట్ల  విలువగల 38 కిలోల కార్బన్ స్వాధీనం
  • వివరాలు వెల్లడించిన ఎస్పీ పరితోశ్ పంకజ్

సంగారెడ్డి టౌన్, వెలుగు: పల్లాడియం కార్బన్ దొంగల ముఠాను అరెస్ట్  చేసినట్లు ఎస్పీ పరితోశ్​పంకజ్​తెలిపారు. వారి దగ్గరి నుంచి రూ.1. 52 కోట్ల  విలువగల 38 కిలోల కార్బన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గురువారం సంగరెడ్డిలోని జిల్లా పోలీస్ ఆఫీసులో మీడియాకు వివరాలు వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 12న బొల్లారం పీఎస్​పరిధిలోని ఎస్ వీ  కో -ఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్లాట్ నెంబర్ 151 లో ఉన్న ఎమ్మెస్ రామ్ ఫేక్స్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చోరీ జరిగినట్లు ఏజీఎం కామేశ్వర శర్మ ఫిర్యాదు చేశారు. 

పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తుండగా గురువారం మహారాష్ట్ర  ప్రాంతంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అమూల్ బాపు జాగడే, రవీంద్ర భగవాన్, గణేశ్ మహాదేవరాథోడ్ ను సర్వీస్ కాజిపల్లి చౌరస్తా వద్ద అరెస్ట్​చేశారు. వారి వద్ద నుంచి 38 కిలోల పల్లాడియం  కార్బన్, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సాంబశివుడు, అక్షయ చవాన్ ,లాలా పాటిల్  పరారీలో ఉన్నట్లు 
తెలిపారు.